చిత్రం చెప్పే విశేషాలు..!

(23-11-2022/2)

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో ‘వైశ్య లైమ్‌లైట్‌ ఫర్‌ వుమెన్‌’ అవార్డుల ప్రదానోత్సవం కోసం నామినేషన్లు స్వీకరించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. ఈ పురస్కారాల ప్రదానోత్సవం ఈ నెల 26న నిర్వహించనున్నారు.

Source: Eenadu

విశాఖ జిల్లా పద్మనాభంలో అనంత పద్మనాభుని కార్తిక దీపోత్సవానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సుమారు 2లక్షల మంది భక్తులు తరలివచ్చారు. రాష్ట్రంలోనే అతి పురాతనమైన అనంత పద్మనాభునికి కార్తికమాసం చివరి రోజున దీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీ.

Source: Eenadu

ఏపీ మంత్రి రోజా చారిత్రక ప్రదేశమైన లేపాక్షిని సందర్శించారు. ఈ అవకాశం తనకు కలిగినందుకు సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.

Source: Eenadu

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ‘జగనన్న భూహక్కు- భూరక్ష’ పథకం రెండో దశను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. మరోవైపు సభకు వచ్చిన వారి నుంచి పోలీసులు పెన్నులు, వాటర్‌ బాటిల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. నలుపు దుస్తులు ధరించిన వారిని సైతం అనుమతించలేదు.

Source: Eenadu

ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌.. దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హైదరాబాద్‌లోని కె.విశ్వనాథ్‌ నివాసానికి వెళ్లిన కమల్‌ ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు.

Source: Eenadu

అక్కినేని నాగ చైతన్య హీరోగా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న చిత్రం టైటిల్‌&ఫస్ట్‌లుక్‌ చైతూ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు ‘కస్టడీ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు.

Source: Eenadu

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజైన నేటి ఉదయం కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్‌ అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. 

Source: Eenadu

మాదాపూర్‌ హైటెక్స్‌లో 14వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో నిర్వహించారు. ఈ ఎక్స్‌పోను వీక్షించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులు, సందర్శకులు వచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్‌రెడ్డి అక్కడ ప్రదర్శనకు ఉంచిన కోడి పిల్లలను పరిశీలించారు.

Source: Eenadu

చిత్రం చెప్పే విశేషాలు!(27-11-2022/2)

చిత్రం చెప్పే విశేషాలు..!(27/11/2022/1)

భారత రాజ్యాంగం అమలు ఎలా జరిగిందంటే...!

Eenadu.net Home