చిత్రం చెప్పే విశేషాలు!

(27-11-2022/2)

హామిల్టన్‌ వేదికగా జరుగుతున్న భారత్, న్యూజిలాండ్‌ రెండో వన్డే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. కాసేపు పడుతూ.. కాసేపటి తరువాత ఆగిపోతూ ఉంది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.

Source: Eenadu

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన ఈ ఉదయం రథోత్సవం నిర్వహించారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లో సాగిన ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Source: Eenadu

జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక సభ నిర్వహించారు. బ్రెయిన్‌డెడ్‌ అయిన వారి అవయవాలను దానం చేసి ఇతరుల ప్రాణాలను నిలబెట్టిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు సన్మానించారు.

Source: Eenadu

ఇప్పటం గ్రామంలో కూల్చివేత కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు జనసేన ఆధ్వర్యంలో ఆర్థికసహాయం అందజేశారు. మంగళగిరిలోని కార్యాలయంలో పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఒక్కొక్కరికి రూ.లక్ష విలువైన చెక్కులను పంపిణీ చేశారు.

Source: Eenadu

ఇటీవల మృతిచెందిన సినీనటుడు కృష్ణ పెద్దకర్మను ఆదివారం కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్‌బాబు, నమ్రత, మంజుల, సుధీర్‌బాబు తదితరులు కృష్ణ చిత్రపటానికి నివాళి అర్పించారు.

Source: Eenadu

కాంగ్రెస్‌ చేపట్టిన భారత్‌జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ బుల్లెట్‌ బండి నడిపి పార్టీ శ్రేణుల్లో జోష్‌ పెంచారు.

Source: Eenadu

థాయ్‌లాండ్‌లోని లొప్‌బురి ప్రావిన్స్‌లో ‘మంకీ ఫీస్ట్‌ ఫెస్టివల్‌’ నిర్వహించారు. ఈ సందర్భంగా కోతులు వివిధ రకాల పండ్లు తింటూ సందడి చేశాయి. ఏటా కోతులకు కృతజ్ఞత తెలుపుతూ థాయలాండ్‌లో ‘మంకీ ఫీస్ట్‌ ఫెస్టివల్‌’ నిర్వహిస్తుంటారు.

Source: Eenadu

ఇప్పటంలో కూల్చివేతలు జరుగుతున్న తరుణంలో తనను బిడ్డా అంటూ అక్కున చేర్చుకున్న వృద్ధురాలికి పవన్‌ పాదాభివందనం చేశారు. ‘ఆనాడు ఇలాంటి తల్లులే నాకు మద్దతుగా నిలబడ్డారు. అదే నన్ను కదిలించింది. మీ ప్రేమ ముందు ముఖ్యమంత్రి పదవి అయినా చిన్నదే’ అన్నారు.

Source: Eenadu

సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలోని ఎన్‌ఐఎంహెచ్‌ ఆడిటోరియంలో వందే భారతం-నృత్య ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సోలో, జానపద, గిరిజన తదితర విభాగాల్లో కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. 

Source: Eenadu

గమనిక: ఇది ప్రయత్నించకండి

బాక్సర్‌ మీనాక్షి

ఈవీఎంలు ఇలా పుట్టుకొచ్చాయి!

Eenadu.net Home