చిత్రం చెప్పే విశేషాలు..!
(29-11-2022/2)
హైదరాబాద్ మెట్రో ఐదో వార్షికోత్సవ వేడుకలు అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఒగ్గు కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. వారి కోరిక మేరకు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఇలా సరదాగా కాసేపు డోలు వాయించారు.
Source:Eenadu
ఖతార్ రాజధాని దోహాలో ఫిఫా ప్రపంచకప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడి పరిపాలనా భవనం అమిరి దివాన్ వద్ద ఇలా ఒంటెలపై కూర్చొని రక్షకులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Source:Eenadu
పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్ జిల్లా ఛాహర్‌పుర్ గ్రామంలోని పంట పొలాలపై ఎగురుతున్న ఓ చైనా డ్రోన్‌ను సోమవారం రాత్రి బీఎస్‌ఎఫ్ జవాన్లు కూల్చివేశారు. ఇది పాకిస్థాన్ వైపు నుంచి వచ్చి భారత భూభాగంలోకి ప్రవేశించినట్లు తెలిసింది.
Source:Eenadu
ఈఎల్ సాల్వెడార్‌లోని చాపర్రాస్టిక్యూ అగ్నిపర్వతం నుంచి భారీగా పొగ, ఇతర వాయువులు విడుదలవుతున్నాయి. ఈ ప్రభావం మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని స్థానిక ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
Source:Eenadu
సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా రాజమహేంద్రవరంలోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.
Source:Eenadu
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో దివ్యాంగుల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్‌లు కలిసి ఈ పోటీలను ప్రారంభించారు.
Source:Eenadu
గుంటూరు ఇన్నర్ రింగ్‌రోడ్డులోని శ్రీ కన్వెన్షన్‌లో సినీనటుడు ఆలీ కుమార్తె వివాహ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం వైఎస్ జగన్ నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Source:Eenadu
బంజారాహిల్స్‌లో చుట్టూ పచ్చని ప్రకృతి మధ్య ఠీవిగా కనిపిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనం.
Source:Eenadu
ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాల్సిన ఆవశ్యకతను సినిమా రూపంలో తీసుకొస్తున్నారు. అందుకు సంబంధించిన చిత్రీకరణ రాజధాని ప్రాంతమైన వెలగపూడిలో జరుగుతోంది.
Source:Eenadu