చిత్రం చెప్పే విశేషాలు!
(08-12-2022/2)
పోలీసు రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు తెలంగాణ వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. పరుగు పందెం, షాట్ పుట్, లాంగ్ జంప్ విభాగాల్లో అభ్యర్థుల సామర్థ్యాలను పరీక్షించారు.
Source: Eenadu
విజయవాడ నగరంలో ఓ నూతన షాపింగ్‌మాల్‌ను మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీనటులు రామ్, మెహ్రీన్ హాజరై సందడి చేశారు.
Source: Eenadu
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి’ కార్యక్రమం ఇవాళ గుంటూరు జిల్లా నారాకోడూరులో నిర్వహించారు. తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు రాకతో దారులన్నీ జనసంద్రంగా మారాయి.
Source: Eenadu
బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్‌లో ‘టైమ్స్ ఫ్యాషన్ వీక్’ రెండో రోజూ కొనసాగింది. హిమాయత్‌నగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ విద్యార్థులు రూపొందించిన కలెక్షన్లు ధరించి మోడళ్లు ర్యాంప్‌పై సందడి చేశారు.
Source: Eenadu
మూడు దశాబ్దాలుగా గుజరాత్‌లో ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న భారతీయ జనతా పార్టీ.. మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. దీంతో గాంధీనగర్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, పార్టీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ శ్రేణులతో కలిసి సంబరాలు చేసుకున్నారు.
Source: Eenadu
ఖమ్మం నగరంలో ఎన్ఎస్‌ఎస్ యూత్ ఫెస్టివల్-2022 నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.
Source: Eenadu
హుస్సేన్‌సాగర్ తీరంలో ఈ నెల 10, 11 తేదీల్లో జరగనున్న రేసింగ్ లీగ్‌కు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. రేసర్లకు, కార్లకు ఎలాంటి ప్రమాదం జరగకుండా టైర్లతో రక్షణ ఏర్పాటు చేశారు. సందర్శకులు రేసు తిలకించేందుకు వీలుగా భారీ స్క్రీన్‌లు ఉంచారు.
Source: Eenadu
హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. దీంతో హైదరాబాద్‌లోని గాంధీభవన్ వద్ద ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.
Source: Eenadu