చిత్రం చెప్పే విశేషాలు..!
(06-08-2022/2)
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు దిల్లీ వెళ్లారు. అక్కడి విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబుకు తెదేపా ఎంపీలు స్వాగతం పలికారు.
Source: Eenadu
ముంబయిలో తితిదే నిర్మించనున్న శ్రీవారి ఆలయ భూమిపూజకు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌లను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఆహ్వానించారు. ఆగస్టు 21న భూమిపూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Source: Eenadu
వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్‌లోని డబీర్‌పురా బీబీకా ఆలంను దర్శించుకొని ప్రార్థనలు చేశారు..
Source: Eenadu
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో 14 గేట్ల ద్వారా 77వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు.
Source: Eenadu
ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా దిల్లీలో ఆయన చిత్రపటానికి తెరాస ఎంపీలు, నాయకులు నివాళి అర్పించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు.
Source: Eenadu
జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబు దాడి ఈ తేదీనే(1945 ఆగస్టు6, 9 తేదీలు) జరిగింది. ఈ సందర్భంగా యుద్ధాలు వద్దు.. శాంతి పాటించడమే మంచిదంటూ ముంబయిలోని విద్యార్థులు ముఖాలపై సందేశాన్నిచ్చే పెయింటింగ్స్‌తో శాంతి ర్యాలీ నిర్వహించారు.
Source: Eenadu
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ద్వారకలోని ద్వారకాదీశుడి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సిబ్బంది ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు.
Source: Eenadu
ఇటీవల కోనసీమ ప్రాంతంలో వరద బాధితులను ఆదుకోవాలని కోరుతూ సీఎంకు వినతి పత్రం ఇవ్వాలని ప్రయత్నించి.. బలంగా గళం వినిపించిన జనసేన వీర మహిళలను పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభినందించారు.
Source: Eenadu
శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన వివాహ వేడుకకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వధూవరులు మాధురి, వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్‌లను ఆయన ఆశీర్వదించారు.
Source: Eenadu