చిత్రం చెప్పే విశేషాలు..!
(15-12-2022/2)
ఆది పినిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న నూతన చిత్రం ‘శబ్దం’ షూటింగ్ పూజా కార్యక్రమం ఇవాళ జరిగింది. వైశాలి దర్శకుడు అరివళగన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
Source: Eenadu
తిరుమల శ్రీవారిని సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శించుకున్నారు. ఈ ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన కుమార్తె ఐశ్వర్యతో కలిసి పాల్గొన్నారు. తితిదే ఈవో ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికారు.
Source: Eenadu
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష, ప్రాణత్యాగాన్ని నేటి తరానికి తెలియజేయాలనే సంకల్పంతో నటుడు సాయిచంద్ కాలినడక దీక్ష చేపట్టారు. చెన్నై మైలాపూర్ నుంచి ప్రకాశం జిల్లా పడమటిపల్లె వరకు దీక్ష కొనసాగనుంది.
Source: Eenadu
సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా గురువారం నిజామాబాద్ జిల్లాకేంద్రంలో వాక్ ఫర్ యూనిటీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.
Source: Eenadu
యాదాద్రి భువనగిరి జిల్లాలోని నాగిరెడ్డిపల్లి వద్ద లారీ అగ్నిప్రమాదానికి గురైంది. చెన్నై వైపుగా విద్యుత్తు తీగల లోడుతో వెళ్తున్న లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి దగ్ధమైంది. సుమారు రూ.2.03కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం.
Source: Eenadu
కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘రంగమార్తాండ’. ఈ సినిమా కోసం చిరంజీవి స్వయంగా ఓ షాయరీ చెప్పారు. ఈ కవితాఝరిని డిసెంబర్ 21న ఉదయం 11.07 ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.
Source: Eenadu
అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు.
Source: Eenadu
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో భవానీ దీక్షల విరమణలు ప్రారంభమయ్యాయి. మల్లేశ్వరాలయ మెట్ల మార్గంలో మల్లికార్జున మహామండపం దిగువన ఏర్పాటు చేసిన ప్రాంతంలో మాలధారులు ఇరుముడులను గురుభవానీలకు సమర్పిస్తున్నారు.
Source: Eenadu
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రముఖ సినీనటుడు యశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Source: Eenadu