చిత్రం చెప్పే విశేషాలు..!
(20-12-2022/2)
ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో అర్జెంటీనా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ట్రోఫీ తీసుకొని ఆటగాళ్లు ఇవాళ స్వదేశంలో అడుగుపెట్టారు. సాకర్ అభిమానులకు ట్రోఫీ చూపిస్తూ సందడి చేశారు.
Source: Eenadu
ఇజ్రాయెల్‌లోని లఛిష్ అడవిలో ఓ పురాతన గుహ బయల్పడింది. దానిని ఇస్లామిక్ శకం ప్రారంభంలోని సలోమె గుహగా గుర్తించారు. అందులో ఈ ప్రమిదలు లభించాయి. దాదాపు 2వేల ఏళ్ల పూర్వం నాటి ఈ ప్రమిదల ఆకృతి చూసి పురావస్తు శాస్త్రవేత్తలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
Source: Eenadu
దిల్లీలోని పార్లమెంటు సమీపంలో.. రైసీనా హిల్స్ వద్ద కమ్మేసిన పొగమంచు.
Source: Eenadu
భారత్‌లో పర్యటిస్తున్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.. కేంద్రమంత్రి ఎస్.జైశంకర్‌తో భేటీ అయ్యారు. డిజిటల్ రంగంలో భారత్ దూసుకుపోతున్న తీరు, ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పుల గురించి వీరు చర్చించారు.
Source: Eenadu
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జాతీయ స్థాయి స్విమ్మింగ్ ఛాంపియన్ పోటీలు ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఫ్రీస్టైల్, బ్యాక్‌స్ట్రోక్, బటర్ ఫ్లై తదితర విభాగాల్లో ప్రతిభ చాటారు.
Source: Eenadu
మాస్ మహారాజ్ రవితేజ తన మాస్ చిత్రాల దర్శకులు బాబీ, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడితో కలిసి తాజాగా ఓ ఫొటో దిగారు. మాస్ ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్ పిక్ అంటూ ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Source: Eenadu
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా గెలుపు, మెస్సి ప్రదర్శన పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. భారత్‌తో గురువారం రెండో టెస్టు జరగనున్న నేపథ్యంలో బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్.. మెస్సీ జెర్సీ ధరించి మైదానంలో ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించాడు.
Source: Eenadu
2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో నేడు పార్లమెంటులో ‘మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్’ నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ఈ విందుకు హాజరై పలువురు నేతలో ముచ్చటించారు.
Source: Eenadu