చిత్రం చెప్పే విశేషాలు!

(26-12-2022/2)

న్యూయార్క్‌లోని జునూన్‌ అనే భారతీయ రెస్టారెంట్‌ను ప్రముఖ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ సందర్శించారు. విదేశీ పర్యటనల్లో ఉన్న ఆయన.. ఇందులోని వంటకాలను రుచి చూశారు. అవన్నీ అద్భుతంగా ఉన్నాయని చెబుతూ ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు.

Source: Eenadu

ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువ స్థాయిలోనే కొనసాగుతుండడంతో అమెరికాలో జనజీవనం ఇంకా మెరుగుపడలేదు. ప్రజలు తమ తమ ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొన్నిచోట్ల చలిగాలులు వీస్తున్నాయి. ఇళ్లు, రోడ్లు, వాహనాలను ఇలా మంచు కప్పేసింది.

Source: Eenadu

వైయ‌స్ఆర్ జ‌గ‌న‌న్న శాశ్వత భూహక్కు- భూరక్ష (భూముల సమగ్ర రీసర్వే)పై క్యాంపు కార్యాలయంలో సీఎం జ‌గ‌న్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వే కోసం వినియోగిస్తున్న డ్రోన్లు, రాళ్లను ఆయన పరిశీలించారు.

Source: Eenadu

బాలీవుడ్‌ కథానాయిక అనుష్క శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘చక్‌దా ఎక్స్‌ప్రెస్‌’. భారత క్రికెటర్‌ జులన్‌ గోస్వామి జీవిత నేపథ్యం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. షూటింగ్‌ మొత్తం పూర్తయిందని వెల్లడిస్తూ చిత్రబృందం సెట్లో కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసింది. 

Source: Eenadu

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాలుగో రోజు సోమవారం స్వామివారు నరసింహావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

Source: Eenadu

నవీన్‌ పొలిశెట్టి హీరోగా కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అనగనగా ఒక రాజు’. సోమవారం నవీన్‌ పొలిశెట్టి జన్మదినం సందర్భంగా చిత్రబృందం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విటర్‌ వేదికగా ఈ ఫొటోను పంచుకుంది. 

Source: Eenadu

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శ్రీశైలం మల్లికార్జున దేవస్థానాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో నూతనంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు.

Source: Eenadu

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home