చిత్రం చెప్పే విశేషాలు..!
(30-12-2022/2)
ఈక్వెడార్‌లోని కోటోపాక్సి అగ్నిపర్వతం నుంచి విడుదలవుతున్న పొగ, బూడిద
Source: Eenadu
భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన శుక్రవారం స్వామివారు బలరామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
Source: Eenadu
హైదరాబాద్ నారాయణగూడలోని శ్రీ ఆకాశ్ జూనియర్ కళాశాల ఆరో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు హుషారైన ఆటపాటలతో హోరెత్తించారు.
Source: Eenadu
చిత్తుకాగితాలు ఏరుకునే మహిళ తన నెలల వయసున్న చిన్నారి నడుముకు తాడుకట్టింది. చిన్నారి ఆడుకుంటూ వాహనాల వద్దకు వెళ్లకుండా ఇలా జాగ్రత్తపడింది. పక్కనే ఒక వృద్ధురాలిని కాపలాగా పెట్టింది. నాంపల్లి రైల్వేస్టేషన్ ఎదురుగా బస్టాప్‌లో కనిపించిన చిత్రమిది.
Source: Eenadu
శిరస్త్రాణం, నంబర్‌ప్లేట్ లేకుండా ఓ పోలీసు ద్విచక్రవాహనంపై విధులకు హాజరయ్యేందుకు బయలుదేరాడు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఈ చిత్రం కనిపించింది.
Source: Eenadu
ఉస్మానియా యూనివర్సిటీలో ‘గ్లోబల్ అల్యూమినీ మీట్-2023’ పేరుతో వేడుక నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుంచి ఎన్‌సీసీ గేట్ వరకు 2కెరన్ ఏర్పాటు చేయగా.. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Source: Eenadu
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ శుక్రవారం ఉదయం మృతిచెందారు. ఆమెకు నివాళి అర్పిస్తూ ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పం తీర్చిదిద్దారు.
Source: Eenadu
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘వీరసింహారెడ్డి’. జనవరి12న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు మరో 13రోజులు మాత్రమే ఉందని తెలుపుతూ చిత్రబృందం బాలకృష్ణకు సంబంధించిన నూతన పోస్టర్‌ను విడుదల చేసింది.
Source: Eenadu
చిరంజీవి హీరోగా కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమాలో రవితేజ, చిరంజీవిల మీద చిత్రీకరించిన ‘పూనకాలు లోడింగ్’ పాటను హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు నటుల ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు.
Source: Eenadu
ఇజ్రాయెల్‌లోని మధ్యధరా సముద్ర తీరంలో ఓ ఈత కొడుతున్న వ్యక్తి సమీపంలో సాండ్‌బార్ షార్క్‌లు ఇలా గుంపులుగా కనిపించాయి. మరి ఆ వ్యక్తికి ప్రమాదమే కదా అని ఊహిస్తున్నారా. అదేం లేదండి.. ఇవి మనుషులకు ఎలాంటి హాని తలపెట్టవట.
Source: Eenadu