చిత్రం చెప్పే విశేషాలు!

(06-01-2023/2)

చిరంజీవి నటించిన‘వాల్తేరు వీరయ్య’.. సంక్రాంతి కానుకగా ఈ నెల 13న విడుదల కానుంది. శనివారం ట్రైలర్‌ రాబోతోందని, ఆదివారం ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించనున్నామని చెబుతూ చిత్రబృందం ఈ పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.

Source: Eenadu

మాస్ మహారాజ రవితేజ హీరోగా నక్కిన త్రినాథరావు తెరకెక్కించిన ‘ధమాకా’ గత నెల 23న విడుదలైంది. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ సినిమా రూ.100 కోట్లు+ గ్రాస్‌ సాధించినట్లు చిత్రబృందం వెల్లడిస్తూ ఈ పోస్టర్‌ను విడుదల చేసింది.

Source: Eenadu

మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌కు సచిన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘1983లో కపిల్ దేవ్‌ వరల్డ్‌ కప్‌ ఎత్తినప్పుడు ఓ పదేళ్ల బాలుడు చూశాడు. భారత్‌ కోసం అలాంటి ఘనత తాను కూడా సాధించాలని కలగన్నాడు. ఆ బాలుణ్ని నేనే. హ్యాపీ బర్త్‌డే కపిల్‌ పాజీ’ అంటూ ట్వీట్‌ చేశారు.

Source: Eenadu

హైదరాబాద్ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ విషయాన్ని కేటీఆర్‌ తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ‘హిందూ కేసరి-2022’ పేరిట కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌ ముఖ్య అతిథిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. పలువురు క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

Source: Eenadu

భారతదేశానికి దక్షిణ సరిహద్దుగా ఉన్న ‘ఇందిరా పాయింట్‌’ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సందర్శించారు.

Source: Eenadu

అనురాగ్‌, అవికాగోర్ జంటగా సత్య ద్వారపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉమాపతి’. ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ ‘బుట్ట’ పాటను జనవరి 7న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

Source: Eenadu

హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో దుస్తులు, ఆభరణాలకు సంబంధించిన హైలైఫ్‌ ఎగ్జిబిషన్ నిర్వహించారు. కార్యక్రమంలో సినీనటి రిచా పనయ్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home