చిత్రం చెప్పే విశేషాలు!
(11-01-2023/1)
కాలిఫోర్నియాలోని మొర్రో బేలో వరద నీటిలో చిక్కుకున్న కార్లు
source : eenadu
అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
source : eenadu
చింతపల్లి మండలం చెరువులవెనం వెళ్లే వారంతా ఇబ్బందులు పడుతున్నారు. రహదారి నడకకు అనువుగా లేకపోవడంతో సందర్శకులు ఇలా జారిపడుతున్నారు.
source : eenadu
విజయనగరం జిల్లా కేంద్రంలో రైల్ కోచ్ రెస్టారెంట్ అందుబాటులోకి రానుంది. విశాఖపట్నంలో ఖాళీగా ఉన్న ఓ బోగిని తీసుకొచ్చి రంగులతో తీర్చిదిద్దారు. బుధవారం ప్రారంభించనున్నట్లు రైల్వేస్టేషన్ ప్రబంధకుడు మురళీకృష్ణ తెలిపారు.
source : eenadu
ఉరుకుల పరుగుల జీవితంలో.. పిల్లల ఆలనపై నగర మహిళలు ప్రత్యేకతను చాటుతున్నారు. పని నిమిత్తం ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ మహిళ.. తన చిన్నారిని ఇలా ‘బేబీ క్యారీ బ్యాక్’లో తీసుకెళ్తుండగా.. ఆ బుజ్జాయి హాయిగా నిద్దరోతున్న దృశ్యం పంజాగుట్టలో కనిపించింది.
source : eenadu
భారత్, న్యూజిలాండ్ మధ్య ఈ నెల 18న ఉప్పల్ స్టేడియంలో వన్డే మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పిచ్ తయారీపై క్యూరేటర్ చంద్రశేఖర్‌కు సూచనలు చేస్తున్న అజహరుద్దీన్.
source : eenadu
పొలాల్లో మిరపకాయలను ఆరబెట్టే స్థలం లేకపోవడంతో నాలుగు వరుసల రహదారిని రైతులు వినియోగించుకుంటున్నారు. మంచు, చలి తీవ్రతతో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యాతండా, కోక్యాతండా సమీపంలో రహదారిపైనా ఇలా కిలోమీటర్ల మేర మిరపకాయలను ఆరబెడుతున్నారు.
source : eenadu
నల్గొండ జిల్లా గుండ్లపల్లి (డిండి) మండలంలోని గ్రామాల్లో ఉన్న పంట పొలాలకు కూలి పనులకు వెళ్లాలంటే ఆటోలో ఇలా కిక్కిరిసి ప్రమాదకరంగా ప్రయాణించాల్సిందే. ఇలా వెళ్తే గానీ గిట్టుబాటు కావడం లేదని రైతు కూలీలు తెలిపారు.
source : eenadu