చిత్రం చెప్పే విశేషాలు
(12-01-2023/1)
కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, రామాలయం, గీతా మందిరాల్లో కూడారై వేడుకను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన దీపాల అలంకరణ ఆకట్టుకుంది.
source:eenadu
మహబూబాబాద్ జిల్లాలోని మానుకోట సహా పలు ప్రాంతాలు మంచుదుప్పటి కమ్మేసింది. కురవిలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయాన్ని ఇలా మంచు కమ్మేయడంతో భక్తులు చలితో వణికిపోయారు.
source:eenadu
థారూర్ నుంచి వికారాబాద్ వెళ్లే మార్గంలో కెరెళ్లి సమీపంలో రైతులు పూలసాగు చేపట్టారు. వీటిలో బంతి, చేమంతి తదితరాలున్నాయి. విరబూసిన చేమంతులు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
source:eenadu
జై శ్రీమన్నారాయణ నామస్మరణతో సంగారెడ్డి పట్టణం మార్మోగింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకొని వైకుంఠపురం దేవాలయం నుంచి రథయాత్ర నిర్వహించారు. భక్తులు సంప్రదాయ నృత్యాలతో అలరించారు.
source:eenadu
నదిపై వంతెన, నీటిలో కనిపిస్తున్న దాని ప్రతిబింబం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అనకాపల్లి జిల్లాలోని తుని-పాయకరావుపేట మధ్య ఉన్న తాండవ నదిపై ఉన్న రైల్వే వంతెన నీటిలో ఇలా కనిపించింది.
source:eenadu
నందమూరి బాలకృష్ణ నటించిన 107వ చిత్రం ‘వీరసింహారెడ్డి’ విడుదల సందర్భంగా సత్తెనపల్లిలో ఆయన ఫ్యాన్స్ 107 కేజీల భారీ కేకు కోసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
source:eenadu
వాతావరణం మారింది. చలి తీవ్రతతో జనం అవస్థలు పడుతున్నారు. అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖైరతాబాద్ లేక్‌వ్యూ పార్కులో ఉదయం తన పెంపుడు శునకానికి స్వెటర్ వేసి వాకింగ్‌కు వచ్చిన అమ్మాయి.
source:eenadu
ఫిక్కీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నార్సింగిలో జరిగిన ఫ్లో హైదరాబాద్ బిజినెస్ అవార్డుల ప్రదానోత్సవంలో దివ్యాంగ కళాకారుల నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
source:eenadu