చిత్రం చెప్పే విశేషాలు
(13-01-2023/1)
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి తమ స్వస్థలాలకు వెళ్లేందుకు పెద్దసంఖ్యలో వచ్చిన ప్రయాణికులతో బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్ తదితర బస్టాండ్లకు ప్రయాణికులు పోటెత్తారు.
source : eenadu
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. శివార్ల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చి ఇంటింటా తిరిగి భిక్షాటన చేసి డబ్బులు సమకూర్చుకోడానికి గంగిరెద్దుల వాళ్లు తరలివస్తుంటారు. అలా బసవయ్యతో మేత ఎత్తుకుని నగరానికి వస్తున్న చిత్రం అమీర్‌పేట వద్ద కనిపించింది.
source : eenadu
బాపట్ల జిల్లా అద్దంకి మండలం ధర్మవరంలో పదో శతాబ్దం నాటి అరుదైన వీరగల్లు(యుద్ధంలో మరణించిన వారి స్మారకార్థం వేసే శిల)శాసనం గురువారం వెలుగు చూసింది. చరిత్ర పరిశోధకులు విద్వాన్ జ్యోతి చంద్రమౌళి గుడి గోడపై దీన్ని గుర్తించారు.
source : eenadu
చిత్రంలోని చెట్టు పసుపు వర్ణం పూలతో భలేగా ఉందనుకుంటే పొరబడినట్లే. గ్రీష్మ రుతువు కావడంతో చెట్టు నుంచి రాలడానికి సిద్ధంగా ఉన్న ఆకులన్నీ పసుపు వర్ణంలోకి మారాయి. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం ఏదుట్ల వద్ద ప్రధాన రహదారి పక్కన ‘ఈనాడు’ కెమెరాకు చిక్కిందీ దృశ్యం.
source : eenadu
హైదరాబాద్, ఖైరతాబాద్‌సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల ప్రాంగణం ఫ్యాషన్ షోలతో సందడిగా మారింది. డిజైనర్, సంప్రదాయ దుస్తులు ధరించిన విద్యార్థినులు క్యాట్‌వాక్‌తో అదరగొట్టారు.
source : eenadu
అమెరికాలోని న్యూ ఓర్లెన్స్‌లో మిస్ యూనివర్స్ ప్రాథమిక పోటీల్లో భాగంగా ర్యాంప్‌వాక్‌తో ఆకట్టుకున్న మిస్ యూనివర్స్ ఇండియా దివితా రాయ్
source : eenadu
భోగాలిభోగాలి బిహు పండగ నేపథ్యంలో అస్సాంలోని తేజ్‌పుర్‌లో గురువారం భేలా ఘర్‌ను రూపొందిస్తున్న గ్రామస్థులు.
source : eenadu
పవిత్ర గంగానది ప్రక్షాళన కోసం చేపట్టిన ‘నమామి గంగే’ పథకానికి ఇటీవల ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. ఈ పురస్కారం వరించడంతో- గంగానది శుద్ధీకరణకు నిధులు, సాంకేతిక సహకారం అందే వీలుంది.
source : eenadu