చిత్రం చెప్పే విశేషాలు!
(17-01-2023/2)
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని నాగోబా జాతరలో భాగంగా .. దేవునికి అభిషేకం చేసేందుకు మెస్రం వంశీయులు కలశంలో గంగాజలాన్ని ఆలయానికి తీసుకొచ్చారు.
Source: Eenadu
భారాస ఆవిర్భావ సభకు ఖమ్మం నగరం సిద్ధమైంది. సభాస్థలి, వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. నగరంతోపాటు సభాస్థలికి నలుదిక్కులా సుమారు నాలుగైదు కిలోమీటర్ల మేర ప్రాంతాలన్నీ గులాబీమయంగా మారాయి.
Source: Eenadu
న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీమ్ఇండియా ఆటగాడు యజ్వేంద్ర చాహల్ సినీ నటుడు ఎన్టీఆర్‌ను కలిశారు.
Source: Eenadu
వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో రానున్న ‘VT12’ చిత్రానికి సంబంధించిన ఓ ఫొటోను మెగా హీరో ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన వివరాలు జనవరి 19న ప్రకటించనున్నట్లు తెలిపారు. విభిన్న లుక్‌లో వరుణ్ తేజ్ కనిపించనున్నారు.
Source: Eenadu
సినీ ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎల్వీ ప్రసాద్ 115వ జయంతి ఉత్సవాల సందర్భంగా ‘ఎల్వీ ప్రసాద్ పురస్కారం-2023’ని హీరో నందమూరి బాలకృష్ణకు ప్రదానం చేశారు.
Source: Eenadu
సీఎం కేసీఆర్ రేపు యాదాద్రి పర్యటన నిమిత్తం స్థానిక ఘాట్ రోడ్డును ఇలా విద్యుత్ దీపాలతో సుందరంగా ఏర్పాటు చేయడం ఆకట్టుకుంటోంది.
Source: Eenadu
సంక్రాంతి పండగకు సొంత ఊళ్లకు వెళ్లిన పట్టణవాసులు తిరిగు పయనమయ్యారు. దీంతో విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ వద్ద వాహనాలు బారులు తీరిన దృశ్యమిది.
Source: Eenadu
కనుమ సందర్భంగా సోమవారం విశాఖపట్నంలోని ఆర్‌కే బీచ్‌లో పతంగుల పోటీ ఉత్సాహంగా నిర్వహించారు. చిన్నారులు ఎగురవేస్తున్న వివిధ రంగుల పతంగులు ఆకట్టుకున్నాయి.
Source: Eenadu