చిత్రం చెప్పే విశేషాలు!

(21-01-2023/2)

సందీప్‌కిషన్‌ హీరోగా తెరకెక్కిన సినిమా ‘మైఖేల్‌’. ఈ నెల 23న నిర్వహించనున్న సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 

Source: Eenadu

రాయ్‌పుర్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య రెండో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌ టాస్‌ సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టాస్‌ గెలిచిన తర్వాత ఏదో మర్చిపోయినట్లు భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తలపట్టుకున్నాడు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ‘మైన్‌ అండ్‌ యువర్స్‌’ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. కార్యక్రమానికి సినీనటి మంచు లక్ష్మి హాజరై అక్కడ ప్రదర్శనకు ఉంచిన ఆభరణాలు, డిజైనర్‌ దుస్తులను పరిశీలించారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో జనవరి 27 నుంచి 29వరకు పెటెక్స్‌ ఇండియా ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌కు పలువురు నగరవాసులు తమ పెంపుడు జంతువులతో వచ్చి సందడి చేశారు.

Source: Eenadu

ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా దంపతులకు సమీప ప్రాంతాల్లో పోస్టింగ్‌ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో వారి పిల్లలు ఇలా కంటతడి పెడుతూ కనిపించారు.

Source: Eenadu

విశాల్‌ హీరోగా అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మార్క్‌ ఆంటోని’. ఈ సినిమాలో సునీల్‌ నటిస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం సంబంధిత పోస్టర్‌ను ట్విటర్‌లో పంచుకుంది.

Source: Eenadu

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ నాయకులు రాజస్థాన్‌లోని అజ్మీర్‌ దర్గాకు సమర్పించేందుకు శనివారం చాదర్‌ను పంపించారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే తదితరులు పాల్గొన్నారు.

Source: Eenadu

రాయ్‌పుర్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించి సిరీస్‌ కైవసం చేసుకుంది. అంతకు ముందు లక్ష్యఛేదనలో భాగంగా రోహిత్‌శర్మ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఓ బాలుడు అకస్మాత్తుగా మైదానంలోకి దూసుకువచ్చి హిట్‌మ్యాన్‌ను ఆలింగనం చేసుకున్నాడు. 

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(20-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(20-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(19-07-2025)

Eenadu.net Home