చిత్రం చెప్పే విశేషాలు
(22-01-2023/1)
శతాబ్ది ఉత్సవాలకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ముస్తాబైంది. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
Source: Eenadu
తిరుపతి-చంద్రగిరి మార్గంలో అగస్త్యేశ్వరస్వామి ఆలయం వద్ద స్వర్ణముఖి నదిపై ఉన్న వంతెన రక్షణ పిల్లర్లు 2021 నవంబరులో కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
Source: Eenadu
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై అమరావతి ప్రాంత రైతు వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ నెల 23వ తేదీన లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రంతో వరి పంట వేశారు.
Source: Eenadu
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి ‘మల్లన్న’ జాతర ఆదివారం షురూ కానుంది. మూడు నెలల పాటు ఈ జాతర జరగనుంది. దీంతో ఆలయ ప్రాంగణం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించడం ఆకర్షిస్తోంది.
Source: Eenadu
మేడ్చల్, నేరేడ్‌మెట్ డివిజన్ ఆఫీసర్స్ కాలనీ అమ్ముగూడ ప్రధాన దారిలో రోడ్డు పక్కన విద్యుత్తు ఫ్యూజ్‌ద బాక్స్ మూత తెరిచి ప్రమాదకరంగా ఉంది. చేతికి అందే ఎత్తులో ఉండటంతో మూగ జీవాలు, చిన్నారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది.
Source: Eenadu
ఉగాది వస్తుందంటే అందరికి మామిడి కాయలు గుర్తుకొస్తాయి.ఈసారి పక్షం రోజుల ముందే మామిడి చెట్లకు పూత వచ్చిందని రైతులు పేర్కొంటున్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ శివారులో ఓ చెట్టుకు కొమ్మలు కనిపించకుండా ఇలా పూత విరబూసింది.
Source: Eenadu
గ్రామీణ ప్రాంతాలకు సకాలంలో బస్సులు లేక పోవడంతో పాఠశాలలకు వచ్చే విద్యార్థులు ఆటోలు, జీపులను ఆశ్రయిస్తున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో బైరంకొండ, జిలాల్‌పూర్ గ్రామ విద్యార్థులతో ప్రమాదకరంగా వెళ్తున్న ఆటో కనిపించింది.
Source: Eenadu
మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో ఇద్దరు యువకులు బైక్‌పై సరదాగా బయటకు వెళ్లారు. తీవ్రంగా చలేయడం వల్ల వెనుక కూర్చున్న వ్యక్తి బైక్ పైనే పొయ్యి పెట్టి నిప్పంటించాడు. అలా చలి కాచుకుంటూ బయట తిరిగారు.
Source: Eenadu