చిత్రం చెప్పే విశేషాలు
(23-01-2023/1)
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రంగనాయక సాగర్ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రక్రియ మొదలైంది. రూ.125 కోట్ల అంచనా వ్యయంతో పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ టెండర్లు పిలిచింది.
Source: Eenadu
బిహార్‌లోని బడ్కా ఢకాయిచ్ శ్రీరామ్‌జానకీ ఆలయంలో చోరీకి గురైన దేవతా విగ్రహాలివి. కోట్ల రూపాయలు విలువచేసే వీటిని పోలీసులు దొంగల నుంచి స్వాధీనం చేసుకుని బక్సర్‌లో ఆదివారం ప్రదర్శించారు.
Source: Eenadu
విప్లవ వీరుడు చెగువేరా కుమార్తె డా.అలైదా గువేరా ఆదివారం హైదరాబాద్, బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు.
Source: Eenadu
చార్మినార్ సమీపంలోని స్థానికులు జాతీయ పతాక రంగుల దుస్తులు ధరించి ముందస్తుగా గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని చాటారు. ఆదివారం త్రివర్ణ టీషర్టులు ధరించి, నాంపల్లిలోని నుమాయిష్‌కు వెళ్లి సందడి చేశారు.
Source: Eenadu
బెంగళూరు, సస్యకాశి లాల్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శనను వీక్షించేందుకు సందర్శకులు, పర్యాటకులు పోటెత్తారు. విదేశాల నుంచి తెప్పించిన పుష్పాలను చూసేందుకు ఆసక్తి కనబరిచారు.
Source: Eenadu
మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో ఆదివారం నిర్వహించిన హ్యామ్‌స్టెక్ కాలేజ్ ఆఫ్ క్రియేటివ్ ఎడ్యుకేషన్ కళాశాల విద్యార్థుల వార్షిక ఫ్యాషన్ షో-2023 సందడిగా జరిగింది.
Source: Eenadu
ఉప్పల్‌లోని శిల్పారామంలో ఆదివారం పల్లవి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ గురువు వీబీ కృష్ణభారతి శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది.
Source: Eenadu
హైదరాబాద్, నార్సింగిలోని ఓం కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం జరిగిన ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ సందడిగా జరిగింది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
Source: Eenadu