చిత్రం చెప్పే విశేషాలు!

(23-01-23/2)

బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. సినిమా హిట్‌ కావడంతో హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో ‘వీరసింహుని విజయోత్సవం’ వేడుకను నిర్వహించారు. సినీనటి హనీరోజ్‌, బాలకృష్ణ చిత్ర విజయాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు.

Source: Eenadu

వెంకటేష్‌ ప్రధానపాత్రలో, శైలేష్ కొలను దర్శకత్వంలో ఓ చిత్రం రానుంది. వెంకటేష్‌కి ఇది 75వ సినిమా కాగా.. దీనికి సంబంధించిన వివరాలను జనవరి 25న ప్రకటించనున్నట్లు ఒక ఫొటోను చిత్రబృందం ట్వీట్‌ చేసింది. ఈ ఫొటో అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

Source: Eenadu

సినీ నటి, యాంకర్‌ అనసూయ నిజామాబాద్‌లోని ఓ వస్త్ర దుకాణ ప్రారంభోత్సవంలో పాల్గొని సందడి చేశారు.

Source: Eenadu

జస్టిన్ డుపాంట్ (ఎడమ), కీలా కెన్నెల్లీ హవాయిలోని సముద్ర తీరంలో అలలపై ఇలా రైడ్‌ చేసి ఆకట్టుకున్నారు.

Source: Eenadu

ఈరోజు నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ జయంతి సందర్భంగా కేటీఆర్‌ ట్విటర్‌లో ఈ ఫొటోను పంచుకున్నారు. ‘భరతమాత ముద్దుబిడ్డ, ధైర్యశీలి సుభాష్‌ చంద్రబోస్‌ 126వ జయంతి సందర్భంగా ఆయనకు నా వందనాలు’ అని బోస్‌ ఫొటోను ట్వీట్‌ చేశారు.

Source: Eenadu

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్నాన్ని తీర్చిదిద్దారు.

Source: Eenadu

కాంగ్రెస్‌ చేపట్టిన భారత్‌జోడో యాత్ర జమ్మూ కశ్మీర్‌లో కొనసాగుతోంది. ఇందులోభాగంగా పర్యటిస్తున్న రాహుల్‌గాంధీకి ఓ వ్యక్తి ఇలా బాహుబలి వేషధారణలో ఉన్న ఆయన పోస్టర్‌ను బహూకరించి అభిమానం చాటుకున్నాడు.

Source: Eenadu

సల్మాన్‌ఖాన్‌ హీరోగా ఫర్హాద్‌ షంజీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌’. వెంకటేశ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 25న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.

Source: Eenadu

పారిస్‌లో నిర్వహించిన ఫ్యాషన్‌ షోలో మోడల్స్‌ వినూత్నంగా పులులు, సింహాల బొమ్మలతో ఉన్న దుస్తులతో ర్యాంప్‌వాక్‌ చేసి ఆకట్టుకున్నారు.

Source: Eenadu

ఒంగోలు సమీపంలోని ముక్తినూతలపాడు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ఆటోమొబైల్‌ దుకాణాన్ని సినీనటి పాయల్‌ రాజ్‌పూత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె నృత్యం చేసి అభిమానులను ఉత్సాహపరిచారు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(20-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(20-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(19-07-2025)

Eenadu.net Home