చిత్రం చెప్పే విశేషాలు..!

(30-01-2023/1)

జన్నారం గ్రామానికి చెందిన పులబాల నరసింహారావు మిరప పండిస్తున్నారు. దీనికి సోకే తామర పురుగు నివారించేందుకు మిరప తోటలో అక్కడక్కడా జనుము మొక్కలు నాటారు. ఈ మొక్కలకు మందులు ఎక్కువగా పిచికారీ చేస్తే కొంత ఊరట కలుగుతుందని రైతు అంటున్నారు.

Source: Eenadu

ఈ చిత్రం చూడగానే కొల్లేరు పక్షులను గుర్తుకు తెచ్చేలా ఉంది కదూ.. అమరావతి, గన్నవరం వద్ద ఓ వరి పొలంలో పురుగుల కోసం ఇలా పక్షులు ఎగబడుతుండగా కెమెరాకు చిక్కిన దృశ్యం.

Source: Eenadu

విజయనగరం, నెల్లిమర్ల మండలంలోని మల్యాడ తిరుమలగెడ్డ వద్ద పచ్చని తివాచీ పరిచినట్లు ఆకట్టుకుంటోంది. రణస్థలం మార్గంలో చూపరులకు కనువిందు చేస్తోంది. పచ్చని మైదానంలా కన్పిస్తున్నది చెరువే. గుర్రపుడెక్క, నాచు పేరుకుపోయి ఇలా గోచరిస్తోంది.

Source: Eenadu

ఆదివారం నాడు విశాఖపట్నం ఆర్‌కే బీచ్‌ తీరంలో అలల నడుమ సరదాగా సేద తీరుతున్న నగరవాసులు.

Source: Eenadu

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున వివాహ ఘట్టం ఆవిష్కృతమైంది.

Source: Eenadu

ఈ చిత్రంలో కనిపిస్తున్నది పొగమంచో, దోమల కోసం వదిలిన పొగో కాదు. హైదరాబాద్, రాణిగంజ్‌ రోడ్డులో ఓ ఆటో నుంచి వెలువడుతున్న కాలుష్యం. రోడ్డుపై పూర్తిగా కమ్ముకొని వాహనదారులను ఉక్కిరిబిక్కిరి చేసింది.

Source: Eenadu

సికింద్రాబాద్‌ మినిస్టర్‌ రోడ్డులో ఇటీవల అగ్నికి ఆహుతైన దక్కన్‌ మాల్‌ కూల్చివేత పనులు చేపట్టేందుకు తీసుకొచ్చిన భారీ యంత్రం ఇది. ఎంతటి బలమైన వస్తువునైనా తన కొండీలతో పట్టి లాగే శక్తి ఉన్న దీన్ని చూడగానే బాహుబలి యంత్రం అనక మానరు.

Source: Eenadu

బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళి వద్ద పొలాలకు విద్యుత్తు సౌకర్యం కోసం కిలోమీటరు మేర తాటి దుంగలతో విద్యుత్తు లైన్‌ను రైతులే సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(21-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(21-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(20-07-2025)

Eenadu.net Home