చిత్రం చెప్పే విశేషాలు..!

(03-02-2023/2)

సీఎస్‌ఆర్‌(కార్పొరేట్ సామాజిక బాధ్యత)లో భాగంగా హీరో మోటార్స్ యాజమాన్యం తిరుపతిలో 120 ద్విచక్రవాహనాలను పోలీసులకు వితరణగా అందజేసింది.

Source: Eenadu

తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, సీఎం కేసీఆర్‌ ఇలా అసెంబ్లీకి కలిసి వచ్చారు. అనంతరం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు.

Source: Eenadu

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌లో ఈ నెల 9న భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య మొదటి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు కోహ్లీ, పుజారా గ్రౌండ్‌లో ప్రాక్టీసు చేస్తూ కనిపించారు.

Source: Eenadu

నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ మండల కేంద్రంలో వైతెపా అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె ప్రజలను పలకరిస్తూ.. వారి బాగోగులను తెలుసుకుంటూ ముందుకు సాగారు.

Source: Eenadu

‘యువగళం’ పాదయాత్రలో భాగంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పూతలపట్టు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చి ఆయనతో సెల్ఫీ దిగి సంబరపడ్డారు.

Source: Eenadu

అమెరికన్‌ నటి, గాయని ‘కాట్‌ గ్రాహమ్‌’ లాస్‌ ఏంజెలెస్‌లో నిర్వహించిన బ్లాక్‌ మ్యూజిక్ కలెక్టివ్‌ కార్యక్రమానికి హాజరై ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Source: Eenadu

ఆదిలాబాద్‌ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం రాత్రి నుంచి చలిగాలుల తీవ్రత పెరిగింది. శుక్రవారం ఉదయం పొగమంచు కురిసింది. చలిగాలుల తీవ్రతకు గిరిజన ప్రాంతాల్లో ప్రజలు వణికిపోయారు. 

Source: Eenadu

తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Source: Eenadu

చిత్రం చెప్పే విశేషాలు..!(01-04-2023/2)

చిత్రం చెప్పే విశేషాలు..!01-04-2023/1)

చిత్రం చెప్పే విశేషాలు(31-03-2023/1)

Eenadu.net Home