చిత్రం చెప్పే సంగతులు!

(06-02-2023/1)

శ్రీకాకుళం జిల్లాలోని కవిటి మండలం ఇద్దివానిపాలెం సముద్ర తీరంలో ప్లాట్‌ఫారాలు లేకపోవడంతో మత్స్య సంపదను ఇసుక దిబ్బలపై ఇలా ఎండబెడుతున్నారు.

Source : Eenadu

జీవకోటికి వెలుగు ప్రసాదించేందుకు సూర్య భగవానుడు వస్తున్న సమయం ఆకట్టుకుంది. కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం ఓడరేవు సముద్ర తీరంలో ఈ దృశ్యం కనువిందు చేసింది.

Source : Eenadu

ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి జాతీయ రహదారి పక్కన ఓ మోడు చివరిలో రావిచెట్టు పెరుతుగూ చూపరులను ఆకర్షిస్తోంది.

Source : Eenadu

కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండల గ్రామాల్లోని రైతులు పంట పొలాల్లో క్రిమిసంహారక మందు పిచికారీ చేసేందుకు డ్రోన్‌ వినియోగిస్తూ కూలీలకు వెచ్చించే డబ్బులు ఆదా చేసుకొంటున్నారు.

Source : Eenadu

వరంగల్‌లోని హనుమకొండ పబ్లిక్‌ గార్డెన్‌లో ధ్యాన కేంద్రం, చదరంగం, తదితర బొమ్మలు సజీవంగా కనిపిస్తున్నాయి. చిరునవ్వు చిందించే బాలికల బొమ్మలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి.

Source : Eenadu

రాష్ట్రపతి భవన్‌లోని అమృత్‌ ఉద్యాన్‌లో ఆదివారం భార్య కల్పనాదాస్, పెంచుకుంటున్న కుమార్తెలు మహీ, ప్రియాంకలతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌.

Source : Eenadu

కొంగకు రెండు కళ్లు ఒకవైపే ఉన్నట్లుగా కనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. దాని మెడ భాగంలో ఉన్న ఖాళీలో నుంచి అవతల పచ్చని మొక్కలు కనిపిస్తున్నాయి. ఈ అరుదైన దృశ్యం ఆదిలాబాద్‌లోని, తాంసి మండలం మత్తడివాగు వద్ద కెమెరాకు చిక్కింది.

Source : Eenadu

ఆకులన్నీ రాలిపోయి కేవలం కాయలు మాత్రమే చెట్టునిండా బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఈ దృశ్యం హైదరాబాద్‌లోని, మెహదీపట్నం భోజగుట్ట రిజర్వాయర్‌ వద్ద చూపరులను కనువిందు చేస్తోంది.

Source : Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(21-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(21-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(20-07-2025)

Eenadu.net Home