చిత్రం చెప్పే విశేషాలు..!
(08-02-2023/1)
హైదరాబాద్‌లో ఫార్ములా ఈ- రేసింగ్‌కు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. నిర్వాహకులు ట్రాక్‌ను పరిశీలిస్తూ కనిపించారు.
source : eenadu
యాసంగి పంటకు నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోకూడదనే ఉద్దేశంతో మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి కూడవెళ్లి వాగు ద్వారా ఎగువమానేరుకు నీటిని విడుదల చేశారు.
source : eenadu
కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటి జీవాలు ఆహార వేటకు రోజూ వెళతాయి. వాటికి ఆయా ప్రాంతాలు సుపరిచితాలే. చిన్నకోడూరు మండలం మాచాపూర్ పెద్ద చెరువు నీటి నుంచి గొర్రెలు, మేకలు వరుస కట్టి ఎంచక్కా దాటుతున్నాయి.
source : eenadu
కూడవెళ్లి వాగు పరివాహక ప్రాంతమంతా గోదావరి జలాల కళ తాండవిస్తోంది. ఈ నెల 3న ఎంపీ ప్రభాకర్ రెడ్డి.. హల్దీ, కూడవెళ్లి వాగుల్లోకి నీటిని విడుదల చేశారు.
source : eenadu
భారీగా పెరిగిన ఈ వేర్లను చూసి మర్రిచెట్టని అనుకుంటే పొరపాటు పడినట్లే.. ఇది చింత చెట్టు. పాత తాండూరులోని స్థానిక నివాసి సల్మాన్ ఇంట్లో ఉంది ఈ చెట్టు. దీనికి దాదాపు 200 సంవత్సరాలకు పైగా వయసు ఉంటుందని ఆయన తెలిపారు.
source : eenadu
చిన్నకోడూరు మండలంలోని పలు చెరువులు నీటితో నిండుగా ఉన్నాయి. కొంగలు వందలకొద్దీ వచ్చి వాలాయి.
source : eenadu
ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి లక్డీకాపూల్ వెళ్లే దారిలో మంగళవారం ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ఇంతటి రద్దీలోనూ ఓ ద్విచక్ర వాహనదారుడు ఓ భారీ కిటికీ ఫ్రేముతో వాహనాలను తప్పించుకుంటూ తిప్పలు పడుతూ వెళ్లడం కనిపించింది.
source : eenadu
జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద ఆందోళన చేస్తున్న పూజారులు
source : eenadu