చిత్రం చెప్పే విశేషాలు..!

(10-02-2023/1)

విశాఖపట్నంలోని తాటిచెట్లపాలెం పరిసర రైల్వేకాలనీల్లో ఖాళీగా ఉన్న రైల్వే స్థలాల పరిరక్షణకు అధికారులు చర్యలు చేపట్టారు. చుట్టూ ప్రహరీలు నిర్మిస్తూ వాటిపై అందమైన చిత్రాలు వేయిస్తున్నారు. దీంతో ఆయా మార్గాలు ఎంతో ఆహ్లాదంగా మారుతున్నాయి. 

source : eenadu

అమరావతిలోని గుణదల కొండపై కొలువుదీరిన మేరీమాత ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

source : eenadu

విజయనగరం జిల్లా, మక్కువ మండలంలోని వెంగళరాయ సాగర్‌ పరిధిలో గల గోముఖి స్పిల్‌వే వద్ద జలాశయ గర్భం. ఇక్కడి నీటి వనరుపై పెద్దఎత్తున గుర్రపు డెక్క విస్తరించింది. ప్రధాన గేట్లు, మదుముల్లోకి వ్యాపించడంతో సాగునీటి ప్రవాహానికి అడ్డంకిగా మారింది.

source : eenadu

హైదరాబాద్‌ నగరంలో గురువారం రాత్రి టెక్‌ మహీంద్ర ప్రాంగణంలో రేసింగ్‌ కార్ల ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి కేటీఆర్, నటుడు రామ్‌చరణ్, మహీంద్ర అండ్‌ మహీంద్ర ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర.

source : eenadu

హైదరాబాద్‌ నగరంలో మరో అద్భుతం ఆవిష్కృతమైందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. గురువారం రాత్రి హుస్సేన్‌సాగర్‌లో ఏర్పాటు చేసిన అతిపెద్ద ‘ఫ్లోటింగ్‌ మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ను ఆయన ప్రారంభించారు.

source : eenadu

తిరుపతి జిల్లాలోని సతీశ్‌ధావన్‌ స్పేస్‌సెంటర్‌ (షార్‌) నుంచి చేపట్టనున్న చిన్న ఉపగ్రహ వాహకనౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2) ప్రయోగానికి సర్వం సిద్ధం చేశారు. షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి చిన్న ఉపగ్రహ వాహకనౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2) నింగిలోకి బయలుదేరనుంది.

source : eenadu

హతాయ్‌ ప్రావిన్స్‌లో భారత సైన్యం ఏర్పాటుచేసిన ఆసుపత్రిలో బాధితుడికి చికిత్స చేస్తున్న సైనిక వైద్య బృందం.

source : eenadu

కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ ‘ఖేలో ఇండియా గేమ్స్‌’ నేపథ్యంలో ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం గుల్మార్గ్‌లో ఇలా మంచు కురుస్తుండగా కొద్దిసేపు క్రికెట్‌ ఆడారు.

source : eenadu

తుర్కియేలోని హతాయ్‌లో భూకంపం కారణంగా ధ్వంసమైన ఇళ్లలో నుంచి వస్తువులు తెచ్చుకుంటున్న బాధితుడు.

source : eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(21-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(21-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(20-07-2025)

Eenadu.net Home