చిత్రం చెప్పే విశేషాలు...!

(13-02-2023/2)

 ఖమ్మం జడ్పీ సెంటర్‌లో భాజపా స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర నాయకుడు పొంగులేటి సుధాకర్‌ రెడ్డి కార్యకర్తలతో కలిసి ఇలా టిఫిన్‌ చేశారు.

Source: Eenadu

రవితేజ హీరోగా, సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రావణాసుర’. ఈ సినిమాకు సంబంధించిన ‘ప్యార్‌ లోనా పాగల్‌’ అనే వీడియో సాంగ్‌ను ఫిబ్రవరి 18న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

Source: Eenadu

అమెరికాలోని న్యూ ఓర్లీన్స్ ఫ్రెంచ్‌ కార్యాలయంలో ‘క్రేవ్‌ ఆఫ్ బార్కస్‌ డాగ్‌ మార్డి’ పరేడ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వీక్షకురాలు ఇలా కుక్కతో దర్శనమిచ్చారు.

Source: Eenadu

నటులు సిద్ధార్థ్‌ - కియారా అడ్వాణీల రిసెప్షన్‌ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్‌ తారలు మెరిశారు. Source: Eenadu

పెరూలోని శాన్ జువాన్‌ డిలో అత్యంత ప్రమాదకరంగా ఉండే ఓ బ్రిడ్జిపై ప్రజలు ఇలా రాకపోకలు కొనసాగిస్తున్నారు. కొన్ని రాజకీయ నిర్ణయాలతో ఆ బ్రిడ్జిపై గతంలో ఆంక్షలు విధించినప్పటికీ ప్రజలు తమ అవసరాల కోసం ఈ వంతెనపై నడుస్తున్నారు.

Source: Eenadu

పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన కన్నడ హీరోలు యశ్‌, రిషబ్‌ శెట్టిలను ప్రధాని మోదీ కలిశారు. కేజీఎఫ్‌ చాప్టర్‌-1, కేజీఎఫ్‌-2, కాంతార చిత్రాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

Source: Eenadu

ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన మొదలైంది. బెంగళూరు శివారులోని యలహంక వైమానిక శిక్షణ క్షేత్రంలో 14వ ‘ఏరో ఇండియా 2023’ షో నిర్వహించారు. విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

Source: Eenadu

ధనుష్‌, సంయుక్త జంటగా నటించిన చిత్రం ‘సార్‌( SIR)’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సంయుక్త ఓ ఇంటర్య్వూలో పాల్గొని ముచ్చటించారు.

Source: Eenadu

అమెరికాలోని అరిజోనాలో జరుగుతున్న ‘స్టేట్ బౌల్ ఆఫ్ టైం షో’లో బార్బేరియన్ గాయని రిహానా బెగన్ ఇచ్చిన ప్రదర్శన ఆకట్టుకుంది. గర్భిణిగా ఉన్న రిహానా పాట పాడటంతో పాటు నృత్యం చేయడం ఆశ్చర్యపరిచింది.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(22-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(22-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(21-07-2025)

Eenadu.net Home