చిత్రం చెప్పే విశేషాలు!
(17-02-2023/2)
సిద్దిపేటలోని ఓ క్రీడామైదానంలో సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ (సీజన్-3)ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా కథానాయకుడు నాని, క్రికెటర్ అంబటి రాయుడు హాజరయ్యారు. నాని, హరీశ్‌రావు కాసేపు క్రికెట్ ఆడి అభిమానులను అలరించారు.
Source: Eenadu
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలోని నెక్సస్ మాల్‌లో నటి మాళవిక శర్మ.. శాంసంగ్ నీ మోడల్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
Source: Eenadu
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్, మంత్రి మల్లారెడ్డి కీసరలోని రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దీంతో పాటు మొక్కలు నాటి హరిత స్ఫూర్తిని చాటారు.
Source: Eenadu
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్‌పై పారాగ్లైడర్లు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. భారాస రాష్ట్ర నాయకుడు అరవింద్ అలిశెట్టి ఆధ్వర్యంలో ‘హ్యాపీ బర్త్‌డే సీఎం కేసీఆర్ సర్’, ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదాలను గాలిలో ప్రదర్శించారు.
Source: Eenadu
వంద టెస్టుల మార్క్‌ను అందుకోవడం ప్రతి క్రికెటర్ కల. ఈ జాబితాలోకి టీమ్‌ఇండియా ‘నయా వాల్’ ఛెతేశ్వర్ పుజారా చేరిపోయాడు. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో మ్యాచే పుజారా కెరీర్‌లో వందో టెస్టు కావడం విశేషం.
Source: Eenadu
ఆసీస్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ ఫ్యాన్ నేరుగా మైదానంలోకి దూసుకొచ్చాడు. దీంతో భద్రతా సిబ్బంది అతడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఈక్రమంలో మహ్మద్ షమీ దయచేసి అతడిని కొట్టకుండా బయటకు పంపించమని విన్నవించారు.
Source: Eenadu
తన భూమి విషయంలో స్థానిక భారాస నాయకులు మోసం చేశారని వరంగల్ జిల్లా పోనకల్ గ్రామానికి చెందిన సురేందర్ ఆరోపిస్తున్నారు. న్యాయం కోసం ఇందిరా పార్కు ధర్నా చౌక్ నుంచి నాగలి ఎత్తుకొని, ఉరితాడు చేతబట్టి డీజీపీ కార్యాలయం వరకు నడుచుకుంటూ వచ్చి నిరసన తెలిపారు.
Source: Eenadu
ఆసియా జువెల్ షో ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో కర్టెన్‌రైజర్ ఈవెంట్ నిర్వహించారు. కార్యక్రమంలో మోడల్స్ కుసుమ పెనుమూడి, శ్రీలేఖ పాల్గొని నూతన డిజైన్ల నగలతో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
Source: Eenadu
కార్తికేయ, నేహాశెట్టి జంటగా క్లాక్స్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బెదురులంక 2012’. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం గుంటూరులోని విజ్ఞాన్ కళాశాలకు వెళ్లింది. ఈ సందర్భంగా కార్తికేయ, నేహాశెట్టి నృత్యం చేసి విద్యార్థుల్లో జోష్ నింపారు.
Source: Eenadu