చిత్రం చెప్పే విశేషాలు..!
(20-02-2023/1)
ఈ చిత్రంలోనిది ఆకుపచ్చని దూది రాఖీ అనుకుంటే పొరపాటే.. అది ఆకు పురుగు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్ల చాకరిమెట్ల అడవిలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద కనిపించింది.
Source:Eenadu
సోలార్ విద్యుత్తు దీపాలు నిర్వహణ లేకపోవడంతో వృథాగా మారుతున్నాయి. అనంతపురం జిల్లాలోని ఆత్మకూరు మండలం సనప గ్రామం ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్తు దీపం కనిపించకుండా తీగజాతి మొక్క అల్లేసి ఇలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
Source:Eenadu
అనకాపల్లి జిల్లాలోని చోద్యం నుంచి కృష్ణదేవిపేట వెళ్లే రహదారిలో రామచంద్రపాలెం వద్ద ఓ పెద్ద చెట్టుకు ఏకంగా 20 తేనె పట్టులు వేలాడుతున్నాయి. వాహనదారులు ఆసక్తిగా చూస్తూ సెల్ఫీలు దిగుతున్నారు.
Source:Eenadu
తెలంగాణ సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో ఆదివారం తెల్లవారుజామున ‘పెద్దపట్నం’ మహావైభవంగా జరిగింది. కార్యక్రమంలో ఉత్సవ విగ్రహాలతో పెద్దపట్నం దాటుతున్న అర్చకులు.
Source:Eenadu
గద్వాల నుంచి జూరాలకు వెళ్లే రహదారి గుంతలమయంగా ఉంటుంది. ఈ దారిలో వాహనంపై ఇలా కూరగాయల బస్తాలు వేసుకుని, వాటిపైనే కొందరు కూర్చుని ప్రయాణిస్తుండటం ప్రమాదకరంగా కనిపిస్తోంది.
Source:Eenadu
తుర్కియేలో భూకంపం తీవ్రతకు రెండుగా చీలిన ఓ గ్రామం.
Source:Eenadu
విశాఖ ఆర్కేబీచ్‌లో సైకత నటరాజశిల్పం.
Source:Eenadu
ధీరత్వానికి నిలువెత్తు రూపం.. ఛత్రపతి శివాజీ. ఆయన జయంత్యుత్సవాలను ఆదివారం భాగ్యనగరంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి అభిమానులు, పలు సంఘాల నేతలు కాషాయ జెండాలతో శోభాయాత్ర నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ డ్రమ్ వాయిస్తూ సందడి చేసింది.
Source:Eenadu