చిత్రం చెప్పే విశేషాలు..!
(20-02-2023/2)
సినీనటి అనుపమ పరమేశ్వరన్ తన పుట్టినరోజు సందర్భంగా తాజా ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘ నాకు 27’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెప్పినవారికి కృతజ్ఞతలు తెలిపారు.
Source: Eenadu
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.
Source: Eenadu
సంజన, మూలవిరాట్ అశోక్‌రెడ్డి జంటగా వివేక్ పొతిగేని తెరకెక్కిస్తున్న చిత్రం ‘సాచి’. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ నటుడు ప్రభాస్ విడుదల చేశారు. ‘సాచి’ మార్చి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Source: Eenadu
హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో సూత్ర ఎగ్జిబిషన్ నిర్వహించారు. కార్యక్రమంలో బిగ్‌బాస్ ఫేమ్ స్రవంతి చొక్కారపు, పలువురు మోడల్స్ పాల్గొని నూతన దుస్తులు, ఆభరణాలతో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
Source: Eenadu
‘ఆపరేషన్ దోస్త్’లో భాగంగా తుర్కియేలో భూకంప బాధితులకు సేవలందించిన భారత ఆర్మీ వైద్య బృందం తిరిగి స్వదేశానికి వచ్చేసింది. ఈ సందర్భంగా వారు బయలుదేరే ముందు తుర్కియేలో స్థానికులు ఘనంగా వీడ్కోలు పలికారు.
Source: Eenadu
శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలోని స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల విగ్రహాలకు అర్చక సిబ్బంది కృష్ణా నదిలో అవభృతోత్సవ స్నాన కార్యక్రమం నిర్వహించారు.
Source: Eenadu
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీని కలిసి సంఘీభావం తెలిపారు. రష్యా దండయాత్ర కారణంగా నష్టపోతున్న ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం ప్రకటించారు.
Source: Eenadu
ఏలూరులోని కస్తూర్బా ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి విద్యా, వైజ్ఞానిక సదస్సు నిర్వహించారు. ఇందులో విద్యార్థులు ఎడ్లబండి నమూనాకు మూడో చక్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు.. ఎడ్ల మెడపై స్పాంజి ఏర్పాటును చేశారు. దీంతో ఎడ్లపై భారం తగ్గుతుందని వారు తెలిపారు.
Source: Eenadu