చిత్రం చెప్పే విశేషాలు..!
(27-02-2023/1)
సాధారణంగా చెట్లకు ఆకులు పచ్చని వర్ణంలో ఉంటాయి. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కాటేపల్లి వెళ్లే మార్గంలో అల్లాపూర్ శివారులోని ఓ వేప చెట్టు ఇలా మోడు వారింది. చెట్టు ఆకులు ఎర్రని వర్ణంలో మారి కొత్తగా కనిపిస్తున్నాయి.
Source: Eenadu
అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని సింహాద్రి ఎన్టీపీసీ దీపాంజలినగర్ సాధన క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ఆనందమేళా చూపరులను ఆకట్టుకుంది. సంప్రదాయ నృత్య ప్రదర్శనలు, సంగీత విభావరి, మైదానంలో మన సంస్కృతిని చాటిచెప్పేలా తీర్చిదిద్దిన సైకతశిల్పం కనువిందు చేసింది.
Source: Eenadu
ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో జరిగిన ఓ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, ఆయన కుమార్తె కిమ్ జు యే
Source: Eenadu
తాజ్‌మహల్ వద్ద డెన్మార్క్ యువరాజు ఫ్రెడెరిక్, యువరాణి మేరీ
Source: Eenadu
జాతి వైరం మరచిపోయి రెండు మూగజీవాలు సరదాగా ఆడుకుంటున్నాయి. భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని బడివాడ వీధిలో ఓ చిన్న కుక్కపిల్లతో కొన్ని కోతులు సరదాగా గడుపుతున్నాయి. ఓ కోతి కుక్కపిల్లతో ఇలా ఆడుకుంటూ కనిపించింది.
Source: Eenadu
మేఘాలయలోని నాంగ్రియాట్‌లో ఊడల వంతెనపై ఎన్నికల సామగ్రితో వెళ్తున్న సిబ్బంది
Source: Eenadu
ఇక్కడ విద్యార్థుల మధ్య కనిపిస్తున్న హ్యూమనాయిడ్ పేరు ‘శిక్ష’. కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాలల్లో 4వ తరగతిలోపు విద్యార్థులు గేయాలు, గణిత అంశాలు సులువుగా నేర్చుకోవడానికి ఇది సాయపడుతోంది. అక్షయ్ మషేల్కర్ అనే ఫిజిక్స్ ప్రొఫెసర్ దీన్ని రూపొందించారు.
Source: Eenadu
స్వర మాంత్రికుడు ఇళయరాజా హైదరాబాద్ నగరవాసులను ఓలలాడించారు. గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం జరిగిన సంగీత విభావరిలో తన బృందంతో కలిసి వినిపించిన పాటలు శ్రోతల మదిని దోచాయి.
Source: Eenadu