చిత్రం చెప్పే విశేషాలు..!
(27-02-2023/2)
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడోరోజు స్వామివారు జగన్మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఉత్సవమూర్తికి వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
Source: Eenadu
సినీ దర్శకుడు హను రాఘవపూడి, నటులు శత్రు, యువరాజ్ తదితరులు భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ అర్చకులు వారికి ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వారికి వేదపండితులు తీర్థ ప్రసాదాలు అందించారు.
Source: Eenadu
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు ఆదివారం చిరంజీవి తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి, నాగార్జునలు కేంద్రమంత్రిని సన్మానించారు. ‘మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
Source: Eenadu
స్వర మాంత్రికుడు ఇళయరాజా హైదరాబాద్‌లో సంగీత విభావరి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన్ను సినీ దర్శకుడు హరీశ్ శంకర్ కలిసి పాదాభివందనం చేశారు. ‘దేవుడు, ఆయన భక్తుడు’ అని తెలుపుతూ హరీశ్ ట్విటర్‌లో ఈ ఫొటోలను పంచుకున్నారు.
Source: Eenadu
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర తిరుపతి జిల్లా చంద్రగిరిలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన ఓ చిన్నారిని ఎత్తుకొని నడిచారు. చిన్నారికి ఎండ తగలకుండా ఇలా చేయి అడ్డుపెట్టి ముందుకు సాగారు.
Source: Eenadu
హీరోయిన్ నభా నటేశ్ తన తాజా ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కొత్త లుక్‌తో సోఫాలో కూర్చున్న ఈ ఫొటో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.
Source: Eenadu
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని బైక్‌వో ఎలక్ట్రానిక్ వాహనాల సంస్థ కార్యాలయంలో ద్విచక్రవాహనాలకు నూతనంగా ఓ వారంటీ పాలసీని ప్రారంభించారు. కార్యక్రమంలో మోడల్ షారోన్ రియా ఫర్నాండేజ్ పాల్గొని ఫొటోలకు పోజులిచ్చారు.
Source: Eenadu
హిమాయత్‌నగర్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ కళాశాల విద్యార్థులతో ‘ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ-2023’ ఊర్మిళా చౌహాన్ ముచ్చటించారు.
Source: Eenadu