చిత్రం చెప్పే విశేషాలు..!

(02-03-2023/1)

పెరూలో ఓ యువకుడు దాదాపు 800 ఏళ్ల కిందటి మమ్మీని తన ప్రేయసి అంటూ బ్యాగులో పెట్టుకొని తిరుగుతున్న వైనాన్ని గుర్తించిన పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Source: Eenadu 

అత్యవసర వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి వచ్చిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు. సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో రోగి తరఫు వారే స్ట్రెచర్‌ వెతుక్కొని ఇలా లోనికి తీసుకెళ్లాల్సి వస్తోంది.

Source: Eenadu 

రాజీవ్‌ రహదారిలో హైదరాబాద్‌లోని శామీర్‌పేట్‌ చెరువు వంతెన ఇది. రెండేళ్ల క్రితం రక్షణ గోడ కూలింది. నేటికీ మరమ్మతులు చేపట్టలేదు.

Source: Eenadu 

హైదరాబాద్‌లోని అమీర్‌పేట మైత్రివనం సమీపంలో మంగళవారం రాత్రి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ ఏర్పాటు చేసిన ద్విచక్రవాహనాన్ని ఆటోమేటిక్‌ రిమోట్‌ క్రేన్‌ ద్వారా మరో వాహనంలోకి ఎక్కిస్తున్నారు.

Source: Eenadu 

మార్చి మొదలైందో లేదో అప్పుడే సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. దీంతో మనుషులే కాదు మూగ జీవాలూ ఇబ్బందులు పడుతున్నాయి. హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్కులో జంతువులపై నీళ్లు చల్లుతూ వాటికి ఉపశమనం కలిగిస్తున్నారు. 

Source: Eenadu 

పదహారేళ్ల క్రితం ఓ యువతికి స్నేహితుల నుంచి 599 డాలర్ల విలువైన ఫస్ట్‌ జనరేషన్‌ ఐఫోన్‌ కానుకగా అందింది. ఇన్నాళ్లూ సీల్‌ కూడా తెరవకుండా పక్కన పెట్టిన్‌ ఆ ఫోన్‌ను వేలం వేయగా ఏకంగా 63 వేల డాలర్లు(రూ.52 లక్షలు) పలికింది.

Source: Eenadu 

కొండగట్టు ఆలయంలో చోరీకి పాల్పడ్డవారు ఏ దారిలో వెళ్లారనే కీలకమైన సమాచారాన్ని రాబిన్‌ అనే పోలీసు జాగిలం పసిగట్టి విచారణ వేగవంతానికి సహకరించింది. ఈ నేపథ్యంలో బుధవారం ఎస్పీ భాస్కర్‌.. ‘థాంక్యూ రాబిన్‌’ అంటూ ఇలా ఆప్యాయంగా కరచాలనం చేశారు.

Source: Eenadu 

ఎండాకాలం రావడంతో హైదరాబాద్‌లోని ఉప్పల్‌ రోడ్డులో కుండలు విక్రయానికి ఉంచారు. భానుడు భగభగ మండడంతో చల్లని నీరు తాగడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వాటికి గిరాకీ పెరిగినట్లు విక్రయదారులు చెప్పారు.

Source:Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(23-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(23-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(22-07-2025)

Eenadu.net Home