చిత్రం చెప్పే విశేషాలు..!
(06-03-2023/1)
ట్రాఫిక్ పోలీసుల కోసం ట్యాంక్‌బండ్‌పైన అధునాతన చెక్ పోస్ట్ బాక్సులను ఏర్పాటు చేశారు. ఆకర్షణీయంగా ఉన్న ఇవి త్వరలో అందుబాటులోకి రానున్నాయి.దీంతో ఇక్కడ విధులు నిర్వర్తించే సిబ్బందికి ఎండ, వర్షాల నుంచి రక్షణ కలగనుంది.
Source: Eenadu
హైదరాబాద్‌లోని సిటీ కాలేజీ సమీపంలోని కులీకుతుబ్‌షా స్టేడియంలో నిర్వహించిన కొత్వాల్ కుస్తీ ఛాంపియన్‌షిప్-2023 పోటీలు ఆదివారం ముగిశాయి. బేగంబజార్ ఉస్మాన్‌షాహిలోని ఓం వ్యాయామశాలకు చెందిన కేవల్‌యాదవ్ విజేతగా నిలిచారు. ఆయనకు నగర సీపీ ఆనంద్ వెండి గద బహూకరించారు.
Source: Eenadu
మంగపేట మండలం కమలాపురం సమీపంలో మిరపచేలు పక్కన విద్యుత్తు స్తంభానికి తీగ జాతి మొక్క అల్లుకుంది. కమలాపురం-రాంనగర్ రహదారి పక్కనే తీగలకు తగిలేలా విస్తరించి ప్రమాదకరంగా ఉంది. విద్యుదాఘాతం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Source: Eenadu
బ్రహ్మోస్ క్షిపణి ధ్వని వేగానికి దాదాపు మూడు రెట్ల వేగంతో (మ్యాక్ 2.8) ప్రయాణించగలిగే బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణిని భారత నౌకాదళం ఆదివారం ముంబయికి సమీపంలో అరేబియా సముద్రంలో యుద్ధనౌకపై నుంచి విజయవంతంగా ప్రయోగించింది.
Source: Eenadu
రెండు దశాబ్దాల ఉజ్వల కెరీర్‌కు పునాది పడ్డ వేదిక మీదే దిగ్గజ టెన్నిస్ క్రీడాకారిణి సానియా తన చివరి మ్యాచ్ ఆడి రాకెట్‌ను పక్కన పెట్టేశారు. తన కెరీర్ ఆరంభమైన హైదరాబాద్‌లో ఆదివారం చివరగా ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడారు. మంత్రి కేటీఆర్ ఆమెకు జ్ఞాపిక అందించారు.
Source: Eenadu
ఆకుపచ్చ కొమ్మల రెమ్మల మాటున పసుపుపచ్చ రంగులో ఉన్న ఇండియన్ వైట్‌ఐ ప్రేమ పక్షులు.. పుష్పాల మకరందభరిత ఫలాల మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న కనువిందైన దృశ్యాన్ని ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ తన కెమెరాలో బంధించారు.
Source: Eenadu
మహారాష్ట్రలోని ఖేడ్‌లో జరిగిన సభకు భారీ సంఖ్యలో హాజరైన ఠాక్రే మద్దతుదారులు..
Source: Eenadu
యూపీలోని మండకా గ్రామానికి చెందిన ఆరిఫ్ ఖాన్ గుర్జర్ కొన్ని నెలల క్రితం తన పొలంలో గాయపడిన ఓ భారీ కొంగతో స్నేహం.. వీడియో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఎప్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆదివారం ఆరిఫ్‌ఖాన్‌ను కలిసి కొంగతో స్నేహం వివరాలను తెలుసుకున్నారు.
Source: Eenadu