చిత్రం చెప్పే విశేషాలు..!
(06-05-2023/2)
అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో మార్చి 12న జరిగే వేడుకలకు హాజరయ్యేందుకు ‘ఆర్ఆర్ఆర్’ బృందం ఒక్కొక్కరుగా ఆమెరికాకు పయనమవుతున్నారు. తాజాగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎన్టీఆర్ బయల్దేరి వెళ్లారు.
Source:Eenadu
పారిస్‌లో నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఓ మోడల్ ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు.
Source:Eenadu
సినీనటుడు మంచు మనోజ్, మౌనికారెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.
Source:Eenadu
మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత కరీంనగర్‌లోని మానుకొండురులో పర్యటించారు. భారాస కార్యకర్తలు వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్సీ గిరిజన మహిళలతో మాట్లాడి వారి కష్టనష్టాలను తెలుసుకున్నారు.
Source:Eenadu
హైదరాబాద్ మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్‌లో సోమవారం ‘మెంటల్ హెల్త్, డిప్రెషన్ ఇల్‌నెస్’ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మిస్ ఆసియా, నటి ఆకాంక్ష సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొని అవగాహన కల్పించి ఆకట్టుకున్నారు.
Source:Eenadu
సినీ నటుడు అల్లు అర్జున్ తన సతీమణి స్నేహారెడ్డికి ట్విటర్ వేదికగా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ యానివర్సరీ క్యూటీ’ అని పోస్టు పెట్టారు.
Source:Eenadu
మాదాపూర్‌లోని కావూరిహిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ నగల దుకాణాన్ని ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి ప్రారంభించారు. అనంతరం బంగారు ఆభరణాలు ధరించి ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు.
Source:Eenadu
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ.. శునకాన్ని ముద్దు చేస్తున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ ఫొటోకు ఆయన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
Source:Eenadu
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శ్రీదేవిపెద్ద కుమార్తె, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌ఇందులో ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా కనిపించనుందని ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రబృందం ప్రకటించింది.
Source:Eenadu