చిత్రం చెప్పే విశేషాలు..!
(09-03-2023/1)
మహిళా దినోత్సవం సందర్భంగా రామోజీ ఫిల్మ్‌సిటీలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
Source:Eenadu
హైదరాబాద్ నగరంలో హోలీ సంబరాలు రెండో రోజు బుధవారం సందడిగా జరిగాయి. నెక్లెస్‌రోడ్డు పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.
Source:Eenadu
యుద్ధం తెచ్చే వినాశనం ఎంత భయంకరమో చెప్పడానికి ఈ ఫొటోనే సాక్ష్యం. ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణతో దొనెట్స్క్‌లోని ఈ సుందరమైన మరింక పట్టణం నేలమట్టమైంది. ఈ ఫొటోను ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల శాఖ ట్వీట్ చేసింది.
Source:Eenadu
దిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నివాసంలో బుధవారం నిర్వహించిన హోలీ సంబరాల్లో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జై శంకర్, అమెరికా వాణిజ్య శాఖ మంత్రి గినా రిమాండో పాల్గొన్నారు.
Source:Eenadu
హోలీ వేళ విశాఖ తీర ప్రాంతం గులాబీ రంగులోకి మారింది. బుధవారం వేల మంది ప్రజలు సాగర్‌నగర్ సమీప తీరానికి చేరి.. రంగులు చల్లుకుని సందడి చేశారు. మిగిలిన రంగును నీళ్లలో వేసేయడంతో తీరంలో కొంత భాగం ఇలా కనిపించింది.
Source:Eenadu
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం తాజంగిలో హోలీ వేడుకలను గిరిజన సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వేకువజామున ఆలయం వద్ద కట్టెలతో పేర్చిన 100 అడుగుల హోలీ టవర్ శిఖరాన జెండాను ఏర్పాటు చేసి టవర్‌ను దహనం చేశారు.
Source:Eenadu
హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళల ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లో జరిగిన ఉత్సవాలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. మహిళా విభాగం అధ్యక్షురాలు డా.ఉప్పల శారద, ప్రధాన కార్యదర్శి కాచం సుష్మ పాల్గొన్నారు.
Source:Eenadu
ఉద్యోగులు.. పని వేళల అనంతరం కార్యాలయాల నుంచి నివాసాలకు తీసుకెళ్లేందుకు యాజమాన్యాలు వాహనాలను ఏర్పాటు చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్, బయోడైవర్సిటీ ప్రాంతంలో ఐటీ కార్యాలయంలోకి వెళ్లేందుకు బారులు తీరిన వాహనాలు ఇవి.
Source:Eenadu