చిత్రం చెప్పే విశేషాలు..!

(10-03-2023/1)

నిర్మాణాలకు అడ్డుగా ఉందని వృక్షాలను తొలగించడం తరచూ చూసేదే. అందుకు భిన్నంగా.. అవకాశం ఉన్న చోట రక్షించాలనే అలోచన ఫలితమిది. నగర శివారు షాబాద్‌ మండలం చందనవెల్లి పారిశ్రామిక ప్రాంతంలో భూమిని చదును చేసినా చుట్టూ మట్టిని వదలి ఓ చెట్టునిలా రక్షించారు.

Source:Eenadu

సాధారణంగా ఈత చెట్లు ఏపుగా పెరుగుతాయి. కానీ ఈ చెట్టు మాత్రం భూమికి ఆనుకొని చాలా తక్కువ ఎత్తులో ఉంది. అది కూడా ఒకే కాండానికి మూడు శాఖలు పెరిగాయి. ఈ ఈత చెట్టు కల్లు రుచిగా ఉంటుందని పక్క గ్రామాల నుంచి కూడా వస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు.

Source:Eenadu

జమ్మూ-కశ్మీర్‌లోని డోడా జిల్లాలో 100 అడుగుల పొడవైన జాతీయ జెండాను భారత సైన్యం గురువారం ఏర్పాటు చేసింది. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన సైనికులకు నివాళిగా దీన్ని సిద్ధం చేసినట్లు సైనికాధికారులు తెలిపారు.

Source:Eenadu

సముద్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా మత్స్య సంపద అంతరించి పోతుండడంతోపాటు వాటి ఆకృతి సైతం చిన్నగా అయిపోతోంది. ఇందుకు నిదర్శనమే ఈ చిత్రం. 1990లో పెద్దగా ఉన్న ఓ జాతి చేప, 2023 వచ్చేసరికి ఇలా చిన్నగా అయిపోయింది. 

Source:Eenadu

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఫుట్‌బాట్‌ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు వేలాదిగా క్రీడాభిమానులు తరలివచ్చారు.

Source:Eenadu

ఓ వైపు దట్టమైన పొగలు.. మరో వైపు బాంబుల మోతలు.. గుంతల్లో దాక్కోవాలి.. శత్రువును అంతం చేయాలి. అగ్నివీరులకు అచ్చం అలాంటి వాతావరణం ఏర్పాటుచేసి తుపాకుల వినియోగంపై తర్ఫీదు ఇస్తున్నారు ఆర్మీ అధికారులు. గోల్కొండ ఆర్మీ శిక్షణ కేంద్రంలో కనిపించిందీ దృశ్యం.

Source:Eenadu

సంపత్‌ వినాయగర్‌ రోడ్డులోని ఓ జ్యూయలరీ దుకాణ ప్రారంభోత్సవానికి గురువారం విశాఖ నగరానికి వచ్చిన సినీ తార ‘హనీరోజ్‌’ ఆభరణాలు ధరించి సందడి చేశారు.

Source:Eenadu

యోగి వేమన విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవాన్ని విశ్వవిద్యాలయంలోని డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం సెంట్రల్‌ లైబ్రరీ ప్రాంగణంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యం ఆకట్టుకుంది.

Source:Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(24-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(24-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(23-07-2025)

Eenadu.net Home