చిత్రం చెప్పే విశేషాలు!
(11-03-2023/01)
ఉత్తర కొరియాలో జోరుగా సాగుతున్న యుద్ధ విన్యాసాలు..
Source:Eenadu
వనపర్తి జిల్లా హన్వాడ మండలం అంబటోనిపల్లికి చెందిన రైతు తిరుమలయ్యకు మూడెకరాల సాగు భూమి ఉంది. దంతె పరికరాన్ని ఉపయోగిస్తూ.. లోతుగా పెరిగిన కలుపును తొలగించడానికి బరువు కోసం తన కుమారుడి సాయం తీసుకుంటున్నట్లు ‘ఈనాడు’కు వివరించారు.
Source:Eenadu
కనుచూపు మేర పరచుకున్న పచ్చదనం.. రహదారి వెంట చక్కగా తీర్చిదిద్దిన ఉద్యానాలు వాహనదారులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే వాహనదారులు ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తున్నారు.
Source:Eenadu
భారీ హిమపాతం కారణంగా బ్రిటన్‌లోని షెఫీల్డ్ నగరంలో కార్లను కప్పేసిన మంచు..
Source:Eenadu
నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ముక్కాల ద్వారాకానాథ్ కుమార్తె ఉషశ్రీకి విజయవాడకు చెందిన ప్రశాంత్‌తో వైభవంగా వివాహం చేశారు. వివాహం అనంతరం శుక్రవారం ధనలక్ష్మీపురం హెలిప్యాడ్ నుంచి నూతన దంపతులు హెలికాప్టర్‌లో బయలుదేరి విజయవాడకు వెళ్లారు.
Source:Eenadu
ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు తిరుపతమ్మ చిన్న తిరునాళ్లలో భాగంగా శుక్రవారం రాత్రి అమ్మవారి దివ్య ప్రభోత్సవం ఘనంగా జరిగింది. ఆలయాన్ని విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు.
Source:Eenadu
శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం రాత్రి నిర్వహించిన యాస్పైర్-2కే23 ముగింపు వేడుకల్లో ఉత్సాహం ఉరకలేసింది. యువత కేరింతలతో సందడి చేశారు.
Source:Eenadu
ఆరంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రత రోజు రోజుకు పెరుగుతోంది. రహదారులపై ఎండమావులు ఏర్పడి, వాహనదారులను జల నీడల భ్రమలు గొలుపుతున్నాయి. యాదాద్రిలోని వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎండమావులు ఇలా..
Source:Eenadu