చిత్రం చెప్పే విశేషాలు..!

(16-03-2023/2)

ఉపేంద్ర హీరోగా, ఆర్‌.చంద్రు దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘కబ్జ’. మార్చి 17న తెలుగు, కన్నడతోపాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.

Source: Eenadu

ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్‌ సిప్లిగంజ్‌, శివాత్మిక రాజశేఖర్‌ ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రంగమార్తాండ’. ఈ సినిమాను మార్చి 22న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

Source: Eenadu

ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘కబ్జ’. ఆర్‌.చంద్రు దర్శకనిర్మాత. మార్చి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సినీనటి తాన్య ఇలా మెరిశారు.

Source: Eenadu

బాలీవుడ్‌ నటి అలియాభట్ ఘనంగా తన జన్మదిన వేడుకలను చేసుకున్నారు. తన భర్త రణ్‌బీర్‌కపూర్‌తో కలిసి కేకు కోసి సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అలియా.. తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు.

Source: Eenadu

మియామిలో నిర్వహించిన ఓ ఫ్యాషన్‌ షోలో అమెరికన్‌ నటి, గాయని డెమి లవటో పాల్గొని ర్యాంప్‌వాక్‌తో ఆకట్టుకున్నారు.

Source: Eenadu

విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘దాస్‌ కా దమ్కీ. నివేదా పేతురాజ్‌ కథానాయిక. మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రీకరణకు సంబంధించిన మేకింగ్ స్టిల్స్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది.

Source: Eenadu

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సచివాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

Source: Eenadu

నాని, కీర్తి సురేష్‌ జంటగా నటించిన చిత్రం ‘దసరా’. శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడు. మార్చి 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న సినిమా ప్రమోషన్స్‌లో నాని వివిధ భాషల్లో ‘దసరా’ అని రాసి ఉన్న చొక్కాను ధరించి సందడి చేశారు.

Source: Eenadu

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొచ్చిలో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను సందర్శించారు. స్వదేశీ పరిజ్ఞానంతో ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ను రూపొందించడాన్ని ఆమె కొనియాడారు.

Source: Eenadu

భార్యాభర్తలిద్దరు కూలి చేసుకొని ఉపాధి పొందుతున్నారు. దీంతో తన చిన్నారి కుమార్తెను ఒంటరిగా ఇంటి వద్ద ఉంచలేక తండ్రి తనతో పాటు పని చేసే చోటుకు తీసుకెళ్లారు. ఈ దృశ్యం హైదరాబాద్‌లోని మలక్‌పేటలో కనిపించింది.

Source: Eenadu

చిత్రం చెప్పే విశేషాలు (25-04-2024/1)

రెడ్‌ బ్యూటీ..

నేనే బొమ్మనైతే...

Eenadu.net Home