చిత్రం చెప్పే విశేషాలు..!

(17-03-2023/1)

ధరల పతనంతో తీవ్రంగా నష్టపోయిన ఉల్లి రైతులకు క్వింటాకు రూ.600 చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందించడం, రైతు రుణాల మాఫీ సహా వివిధ డిమాండ్లపై మహా పాదయాత్ర చేపట్టిన మహారాష్ట్ర రైతులు.. ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ ఠాణే జిల్లాలోని షాహాపుర్‌ మీదుగా ముంబయి వైపు వెళ్లారు.

Source: Eenadu

లద్దాఖ్‌-జమ్మూకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతాల మధ్య గ్రేటర్‌ హిమాలయాల శ్రేణిలో 11,650 అడుగుల ఎత్తులో ఉండే ఈ మార్గంలో వాహనాల రాకపోకలను జనవరి ఏడో తేదీన నిలిపివేశారు. ఈ ఏడాది 68 రోజులే మూసివేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.

Source: Eenadu

విశాఖ స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపులో పాల్గొన్న సిబ్బంది

Source: Eenadu

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై హైదరాబాద్‌లోని వివిధ విద్యార్థి సంఘాలు గురువారం వేర్వేరుగా ఆందోళనలు నిర్వహించాయి. ఆయా ప్రాంతాల్లో పోలీసులు నిరసనకారులను అరెస్టు చేశారు. 

Source: Eenadu

ట్రాలీ ఆటోలో ఓ పెళ్లి బరాత్‌కు నగిషీల టాంగా తరలించారు. కాస్తా నిశితంగా పరిశీలిస్తే టంగుటూరి ప్రకాశం పంతులు దాన్ని ఎక్కినట్లుంది కదూ.. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. శాసనసభ ఎదుట సిగ్నళ్ల వద్ద వాహనం వెళ్తుండగా కెమెరా క్లిక్‌మనిపించింది.

Source: Eenadu

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గురువారం మొక్కకు కరెన్సీ నోట్లు అతికించి వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్న గ్రూప్‌-డి అభ్యర్థులు. తాము నియామక పరీక్షల్లో ఎంపికైనప్పటికీ ఇంకా విధుల్లోకి తీసుకోనందుకు వారు ఇలా ఆందోళన వ్యక్తం చేశారు.

Source: Eenadu

వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో వడగళ్లతో నిండిన ప్రధాన రహదారి

Source: Eenadu

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 27.9 అడుగుల పొడువు, 5 అడుగుల చుట్టుకొలతతో ఉన్న కలం ఇది. టేకు కర్రతో ఓ వడ్రంగి రూపొందించిన ఈ భారీ కలం ‘వరల్డ్‌ వైడ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకుంది. వరంగల్‌ జిల్లాకు చెందిన కుదురుపాక జగదీశ్వర్‌ ఈ ఘనత సాధించారు.

Source: Eenadu

గమనిక: ఇది ప్రయత్నించకండి

బాక్సర్‌ మీనాక్షి

ఈవీఎంలు ఇలా పుట్టుకొచ్చాయి!

Eenadu.net Home