చిత్రం చెప్పే విశేషాలు..!

(19-03-2023/2)

నాని హీరోగా దర్శకుడు ఓదెల శ్రీకాంత్‌ తెరకెక్కించిన చిత్రం ‘దసరా’. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ ఇలా మెరిశారు.

Source: Eenadu

విశ్వక్‌సేన్‌, మీనాక్షి చౌదరి జంటగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘వీఎస్‌ 10’(వర్కింగ్‌ టైటిల్). ఈ సినిమా చిత్రీకరణను ఆదివారం ముహూర్తపు షాట్‌తో ప్రారంభించారు.

Source: Eenadu

సినీ నటుడు నాని విశాఖలో భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌కు హాజరై సందడి చేశారు. నాని, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన ‘దసరా’ ఈ నెల 30న థియేటర్లలో విడుదల కానుంది.

Source: Eenadu

మంచు మనోజ్‌ తన తండ్రి మోహన్‌బాబుకు ట్విటర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘నడక నుంచి నా నడవడిక వరకు నన్ను నడిపించిన నాన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అని తెలుపుతూ పోస్టు పెట్టారు.

Source: Eenadu

సమంత, దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శాకుంతలం’. ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాలోని స్టిల్స్‌ను పలువురు సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా.. ఇవి ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Source: Eenadu

ఆదివారం సెలవుదినం కావడంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.

Source: Eenadu

రిషబ్‌ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘కాంతార’. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమాను త్వరలో ఇటాలియన్‌, స్పానిష్‌ భాషలలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

Source: Eenadu

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గుజరాత్‌లోని సోమనాథ మహాదేవ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

Source: Eenadu

సమంత, దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శాకుంతలం’. ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మధుబాల.. ‘మేనక’ పాత్ర పోషిస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఈ ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకుంది.

Source: Eenadu

చిత్రం చెప్పే విశేషాలు..!(20-03-2023/1)

చిత్రం చెప్పే విశేషాలు..!(19-03-2023/1)

చిత్రం చెప్పే విశేషాలు..!(18-03-2023/2)

Eenadu.net Home