చిత్రం చెప్పే విశేషాలు...!

(23-03-2023/2)

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కొత్త సినిమా మొదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పూజా కార్యక్రమం గురువారం ఉదయం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. 

Source: Eenadu

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఉండవల్లిలోని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు నివాసం నుంచి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.

Source: Eenadu

సమంత, దేవ్‌మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శాకుంతలం’. ఏప్రిల్‌ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘కావ్యనాయకి శకుంతలా దేవి’ అని చెబుతూ చిత్రబృందం సమంత ఫొటోలను ట్విటర్‌ వేదికగా పంచుకుంది.

Source: Eenadu

విష్వక్‌సేన్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దాస్‌ కా ధమ్కీ’. బుధవారం ఉగాది కానుకగా విడుదలైంది. ఈ నేపథ్యంలో సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.8.88కోట్ల వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం తెలిపింది.

Source: Eenadu

చాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌, లహరీ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘మేమ్‌ ఫేమస్‌’. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం ట్విటర్‌ వేదికగా పంచుకుంది. జూన్‌ 2న సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపింది.

Source: Eenadu

ఇటీవల కురిసిన వర్షాలకు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్లు, రామాపురం, రావినూతల ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. ఎకరానికి రూ.50వేలు పరిహారం ఇవ్వాలని రైతులు ఈ సందర్భంగా సీఎంను కోరారు.

Source: Eenadu

నాని, కీర్తి సురేష్‌ జంటగా నటించిన చిత్రం ‘దసరా’. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రవితేజతో కలిసి దిగిన ఫొటోను నాని ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. మరోవైపు రవితేజ కథానాయకుడిగా నటించిన ‘రావణాసుర’ ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Source: Eenadu

 కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగమార్తాండ’ సినిమా బుధవారం థియేటర్లలో విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమాలో బ్రహ్మానందం నటన అద్భుతంగా ఉందని కితాబిస్తూ చిరంజీవి, రామ్‌చరణ్‌ ఆయన్ను సత్కరించారు.

Source: Eenadu

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పాట పాడిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సత్కరించారు.

Source: Eenadu

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘ఖుషి’. ఈ సినిమాను సెప్టెంబర్‌ 1న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ట్విటర్‌ వేదికగా తెలిపింది. 

Source: Eenadu

అఖిల్‌ అక్కినేని, సాక్షి వైద్య జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఏజెంట్‌’. ఈ సినిమాలోని సెకండ్‌ సింగిల్‌ ‘ఏందే ఏందే’ పాటను 24న లాంచ్‌ చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(24-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(24-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(23-07-2025)

Eenadu.net Home