చిత్రం చెప్పే విశేషాలు!

(24-03-2023/2)

ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలుపొందిన పంచుమర్తి అనురాధ శుక్రవారం తెదేపా అధినేత చంద్రబాబు నాయుడిని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Source: Eenadu

నితిన్‌, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా చిత్రీకరణను శుక్రవారం ముహూర్తపు షాట్‌తో ప్రారంభించారు. కార్యక్రమానికి ప్రముఖ నటుడు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్‌ కొట్టారు. 

Source: Eenadu

అఖిల్‌ అక్కినేని, సాక్షి వైద్య జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఏజెంట్‌’. ఈ సినిమాలోని సెకండ్‌ సింగిల్‌ ‘ఏందే ఏందే’ పాటను ఈరోజు సాయంత్రం 6గంటలకు విడుదల చేయనున్నారు. 

Source: Eenadu

సినీనటి పవిత్ర లోకేశ్‌, సీనియర్ నటుడు నరేష్‌ జంటగా నటిస్తున్న చిత్రానికి టైటిల్‌ ఖరారైంది. ఎంఎస్‌ రాజు దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతోంది. ఈ మేరకు ‘మళ్లీ పెళ్లి’ టైటిల్‌ పోస్టర్‌, గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. 

Source: Eenadu

విష్వక్‌సేన్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దాస్‌ కా ధమ్కీ’.. ఈ నెల 22న థియేటర్లలో విడుదలైంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడలో దుర్గమ్మను దర్శించుకొని జయరామ థియేటర్‌లో ‘దాస్‌ కా ధమ్కీ’ నూన్‌ షోను వీక్షించి అభిమానులతో ముచ్చటించారు.

Source: Eenadu

శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, భాగ్యనగర్‌ కాలనీ వివేకానందనగర్‌ రోడ్డు మార్గాల్లో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికుల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. అంబులెన్సుల్లో ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

Source: Eenadu

పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను జులై 28న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. 

Source: Eenadu

ముంబయిలో గురువారం నిర్వహించిన ‘ఇండియన్‌ స్పోర్ట్స్‌ హానర్స్‌’ రెడ్‌ కార్పెట్‌ కార్యక్రమంలో క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, ఆయన సతీమణి అనుష్కశర్మ ఇలా మెరిశారు.

Source: Eenadu

కిరణ్‌ అబ్బవరం, అతుల్య రవి జంటగా రమేష్‌ కాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మీటర్‌’. ఏప్రిల్‌ 7న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కిరణ్‌ అబ్బవరం రాజమహేంద్రవరంలోని ఐఎస్‌టీఎస్‌ మహిళా కళాశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(24-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(24-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(23-07-2025)

Eenadu.net Home