చిత్రం చెప్పే విశేషాలు..!
(27-03-2023/1)
ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌లో ‘చాకూ చౌక్’ పేరుతో నిర్మించిన కూడలిలో ఏర్పాటుచేసిన 20 అడుగుల రాంపురీ కత్తి
Source:Eenadu
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని మర్కోడు గ్రామ పరిధిలో ఒకే మొదలుతో రెండు వృక్షాలు దర్శనమిస్తున్నాయి. మొదలు ఉన్న మర్రిచెట్టుకు పైభాగాన తాటి చెట్టు కనిపిస్తుంది. మర్రి వేర్లు కప్పివేయడంతో తాటిచెట్టు మొదలు కనిపించడం లేదు.
Source:Eenadu
ఏలూరు జిల్లాలోని విలీన మండలం వేలేరుపాడు మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలోని పనస చెట్టు మొదలు నుంచి భూమికి ఆనుకునే విధంగా కాయలు కాసింది. చెట్టు మొదట్లో గుత్తులుగా 45 కాయలు కాయడంతో కార్యాలయానికి వచ్చే సందర్శకులు వాటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు.
Source:Eenadu
జీ20 సన్నాహక సదస్సుల సందర్భంగా విశాఖ సాగర తీరంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ‘వైజాగ్ కార్నివాల్’లో ఆకట్టుకున్న గిరిజన నృత్యం.
Source:Eenadu
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వెనుక జలాల సమీపంలో ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండలం చిన్నయానం సమీపంలో తీసిన చిత్రమిది. ప్రస్తుతం అక్కడ నీటి ప్రవాహం తగ్గినా.. ఇక్కడి పరిసరాలు కనువిందు చేస్తున్నాయి.
Source:Eenadu
హైదరాబాద్‌లోని లక్డీకాపూల్ వద్ద ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు పిల్లలతో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా.. ముందు కూర్చున్న బాలుడు నిద్రలోకి జారుకున్నాడు. వాహనం ఏమాత్రం అదుపు తప్పినా ప్రమాదమే.
Source:Eenadu
అమరావతి రాజధాని ప్రాంతంలో తుళ్లూరు- రాయపూడి మధ్యలో వంతెన నిర్మాణ పనుల్లో భాగంగా పెద్దగుంతలు తీసి వంతెన నిర్మాణం మొదలుపెట్టారు. ప్రభుత్వం మారిన తర్వాత పూర్తిగా పనులు నిలిపివేయడంతో గుంతల్లో నీరు చేరి రూ.లక్షల విలువ చేసే సామగ్రి ఎందుకూ పనికిరాకుండా పోతోంది.
Source:Eenadu
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లిలో గొర్ల కాపరులు వందలాది గొర్లను మేత కోసం తీసుకెళ్లారు. సాయంకాలం తిరిగి వచ్చే దారిలో గ్రామం చివరన వాగు నీటితో నిండుగా ఉంది. కాపరి ఒక గొర్రెకు శబ్దాలతో సూచన చేయగానే ఒకదాని వెంట మరొకటి ఇలా క్రమశిక్షణతో వాగు దాటాయి.
Source:Eenadu