చిత్రం చెప్పే విశేషాలు

(28-03-2023)

ఆదిలాబాద్‌ పట్టణ శివారులోని చాందా వాగులో పెద్ద ఎత్తున గుర్రపు డెక్క పెరిగింది. వాటిలో విరబూసిన హైసింత్‌ పువ్వులు అందంగా కనిపిస్తున్నా.. ప్రమాదకరంగా ఉన్నాయి.

Source:Eenadu

పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో సోమవారం నేతాజీ భవన్‌ను సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. చిత్రంలో గవర్నర్‌ సీవీ ఆనందబోస్‌..

Source:Eenadu

హైదరాబాద్‌లో శ్రీరామ శోభాయాత్ర, సమావేశం జరిగే హనుమాన్‌ వ్యాయామశాలలో ఏర్పాట్లను సోమవారం అధికారులతో కలిసి నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ పరిశీలించారు. 

Source:Eenadu

ఎండల వేళ ప్రయాణికులకు చల్లదనం కల్పించేందుకు సికింద్రాబాద్‌లోని ఆటోవాలా మల్లేశ్‌ ప్రయత్నం ఇది. ఓ గోనెసంచిలో మట్టి నింపి ఆటోపై పచ్చిక పెంచుతున్నారు. మోండామార్కెట్‌లో మొలకలపై నీళ్లు చల్లుతూ కనిపించారిలా.

Source:Eenadu

పెద్దపెద్ద పళ్లతో భారీగా కనిపిస్తున్న ఈ చేప నమూనాను హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి మెట్రో పార్కింగ్‌ వద్ద ఓ ఎగ్జిబిషన్‌ నిర్వాహకులు ప్రధాన ద్వారంగా ఏర్పాటు చేస్తున్నారు.

Source:Eenadu

రెండు కాళ్లు కోల్పోయిన సునీతకు అండగా నిలుస్తున్నారు ఆమె భర్త కోటి. ఆమెకు ఉద్యోగం వచ్చి 18 ఏళ్లు గడిచాయి. ఐదేళ్ల క్రితం రక్తం గడ్డకట్టి ఇన్‌ఫెక్షన్‌ సోకటంతో ఆమె రెండు కాళ్లను వైద్యులు తొలగించారు. అప్పటి నుంచి భార్యను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు కోటి.

Source:Eenadu

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని అంతర్ల వద్ద అమర్య లిల్లీ పూలు ఆకట్టుకుంటున్నాయి. భారతీయ విద్యాకేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజ్ఞానభారతి పాఠశాల ఆవరణలో ఇవి పెరుగుతున్నాయి. అలంకరణ కోసం వీటిని గార్డెనింగ్‌ ప్లాంట్స్‌గా పెంచుతున్నారు.

Source:Eenadu

శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లికి చెందిన సూక్ష్మ కళాకారుడు వాడాడ రాహుల్‌ పట్నాయక్‌ కోడి ఈకపై గీసిన శ్రీరాముడి పట్టాభిషేకం చిత్రం ఆకట్టుకుంది. 

Source:Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(24-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(24-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(23-07-2025)

Eenadu.net Home