చిత్రం చెప్పే విశేషాలు..!

(29-03-2023/2)

నేచురల్‌ స్టార్‌ నాని తన కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా ట్విటర్‌ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘నా జున్ను 6 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.. మీ ఆశీర్వాదాలు కావాలి’ అంటూ తన కుమారుడితో కలిసి దిగిన ఫొటోను నెటిజన్లతో పంచుకున్నారు.

Source: Eenadu

రవితేజ హీరోగా సుధీర్‌వర్మ తెరకెక్కించిన సినిమా ‘రావణాసుర’. ఏప్రిల్‌ 7న థియేటరల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాలో రవితేజకు సంబంధించిన ఫొటోను చిత్రబృందం విడుదల చేసింది.

Source: Eenadu

నటుడు అల్లుఅర్జున్‌ తన 20 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ట్విటర్‌ వేదికగా బన్నీతో దిగిన ఫొటోను పోస్టు చేశారు.

Source: Eenadu

నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో తెదేపా ఆవిర్భావ సభ ఏర్పాట్లను ఘనంగా చేశారు. అప్పట్లో ఎన్టీఆర్‌ వినియోగించిన చైతన్య రథాన్ని ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు.

Source: Eenadu

ఐపీఎల్‌ 2023 ఈ నెల 31 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ముంబయి ఇండియన్స్‌ జట్టు సభ్యులు రోహిత్ శర్మ, సూర్య కుమార్‌ యాదవ్‌, జోఫ్రా ఆర్చర్‌ కలిసున్న ఫొటోను ఆ టీమ్‌ ట్విటర్‌ వేదికగా పంచుకుంది.

Source: Eenadu

కిరణ్‌ అబ్బవరం, అతుల్య రవి జంటగా రమేష్‌ కాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మీటర్‌’. ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో సినిమా నటీనటులు ఇలా మెరిశారు.

Source: Eenadu

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ రికీ పాంటింగ్, భారత క్రికెటర్‌ పృథ్వీ షా ఇలా సరదాగా ఫొటోలకు పోజులిచ్చారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ల నేపథ్యంలో దిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు చెందిన వీరు ఒక చోట చేరారు.

Source: Eenadu

సినీనటి కాజల్‌ తన తాజా ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోకు ఆమె ఫ్యాన్స్‌ ముగ్ధులవుతున్నారు. కాజల్ ప్రధాన పాత్రలో నటించిన ‘కోస్టి’ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది.

Source: Eenadu

నాగచైతన్య హీరోగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కస్టడీ’. మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాగచైతన్య, వెంకట్‌ప్రభు హైదరాబాద్‌లో హలీమ్‌ తిని, చాయ్‌ తాగి సందడి చేశారు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(24-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(24-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(23-07-2025)

Eenadu.net Home