చిత్రం చెప్పే విశేషాలు

(03-04-2023/1)

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లోని విద్యానగర్‌ కాలనీకి చెందిన అబ్దుల్‌ ముకీబ్‌ ఆరేళ్ల కింద నాటిన రాయల్‌ ట్రీ ఫామ్‌ అనే చెట్టును నాటారు. దాన్ని తొలగించడం ఇష్టంలేక ఆ వృక్షానికి ఇబ్బందులు లేకుండా భవన నిర్మాణ పనులు చేపట్టారు.

Source: Eenadu

రాక్‌ క్లైంబింగ్‌పై హైదరాబాద్‌ నగరవాసుల్లో ఆసక్తి పెరుగుతోంది. వారాంతాల్లో శివారులోని ఖాజాగూడ కొండలపై ఔత్సాహికులు శిక్షణ పొందుతున్నారు. ఆదివారం కొండలపై పలువురు రాఫెలింగ్, రివర్స్‌ రాఫెలింగ్‌ చేస్తూ కనిపించారు.

Source: Eenadu

ఒక మొక్క జొన్న కర్రకు ఒకటి లేదా రెండు కంకులు ఉండటం సహజం. కానీ ఇక్కడ నాలుగు కంకులు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముత్తారంలోని ఓ రైతు పొలంలో ఈ దృశ్యం కన్పించింది.

Source: Eenadu

రహదారికి ఇరువైపులా పల్లెకు స్వాగతం పలుకుతున్నట్లు పచ్చని చెట్లతో పందిరి వేసినట్లుంది కదూ.. ఈ ఆహ్లాదకర దృశ్యం , కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్‌ మండలం పెద్దపాపయ్యపల్లి వెళ్లే దారిలోనిది..

Source: Eenadu

బిడ్డను తల్లి చూసుకున్నంత జాగ్రత్తగా మరెవ్వరూ చూసుకోలేరు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆవరణలో ఓ తల్లి తన బిడ్డకు గొడుగుపట్టి నీడనివ్వగా.. ఆ పక్కనే ఓ వానరం తన పసికూనకు ఎండ తగలకుండా తీసుకెళ్తున్న దృశ్యమిది.

Source: Eenadu

పార్వతీపురం నుంచి కూనేరు వెళ్లే రాష్ట్ర రహదారి దుస్థితి ఇది. కొమరాడ సమీపంలో రోడ్డు గుంతలుగా మారింది. దీంతో ఇటీవల కురిసిన వర్షానికి నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

Source: Eenadu

హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని జలవిహార్‌ వద్ద ఆదివారం నిర్వహించిన అహింసా రన్‌లోని 3కే, 5కే, 10కే పరుగుల్లో పలువురు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Source: Eenadu

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కామర్స్‌ యాభై ఏళ్ల వేడుక ఆదివారం హైదరాబాద్‌లోని బేగంపేటలో కంట్రీ క్లబ్‌లో నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాషన్‌ షో ఆకట్టుకున్నాయి.

Source: Eenadu

ఏర్పేడుకు సమీపంలోని తిరుపతి ఐఐటీ వేదికగా మూడు రోజులుగా నిర్వహిస్తున్న తిరుఉత్సవ్‌ ఆదివారం ముగిసింది. అపారమైన విజ్ఞానాన్ని పంచే విధంగా సాగిన సంబరాలు ఆకట్టుకున్నాయి.

Source: Eenadu

వైయస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల మూడో రోజు ఆదివారం ఉదయం జగదభిరాముడు వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(27-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(24-07-2025)

Eenadu.net Home