చిత్రం చెప్పే విశేషాలు
(03-04-2023/2)
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తెలుగులో నిర్మించనున్న రెండో సినిమా ‘రెయిన్ బో’. ఈ సినిమాలో రష్మికతో పాటు దేవ్ మోహన్ (Dev Mohan) నటించనున్నాడు. సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.
Source:Eenadu
ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్ జంటగా.. హాస్యనటుడు వేణు తెరకెక్కించిన చిత్రం ‘బలగం’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం అందరి ప్రశంసలు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో వేణు రచ్చ రవి వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Source:Eenadu
సినీనటి జాన్వీకపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం జాన్వీకి తీర్థప్రసాదాలు అందజేశారు.
Source:Eenadu
అమెరికాలోని మోంటానా రాష్ట్రం క్లార్క్‌ఫోర్క్ నది తీరాన ఓ రైలు పట్టాలు తప్పింది. సుమారు 25 రైలు బోగీలు అదుపు తప్పి పక్కకు పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
Source:Eenadu
తన సతీమణి నయనతార పిల్లలతో దిగిన ఫొటోను విఘ్నేశ్ శివన్ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. తమ పిల్లలకు ఉయిర్, ఉలగ్ అనే పేర్లు పెట్టినట్లు తెలుపుతూ ఆయన పోస్టు పెట్టారు.
Source:Eenadu
పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్‌గాంధీకి రెండేళ్ల శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు సూరత్ వచ్చిన రాహుల్‌గాంధీకి కాంగ్రెస్ సీనియర్ నేతలు స్వాగతం పలికారు.
Source:Eenadu
ఐకానిక్ స్టార్ అల్లుఅర్జున్ కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా సోమవారం బన్నీ ట్విటర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. తన కుమారుడితో దిగిన ఫొటోను పోస్టు చేస్తూ..‘ హ్యాపీ బర్త్‌డే టు ది లవ్ ఆఫ్ మై లైఫ్. మై స్వీటెస్ట్ చిన్ని బాబు’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
Source:Eenadu
జర్మనీలోని నిడ్డెరౌలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఆ ప్రాంతమంతా వరద ముంపునకు గురైంది. రైలు రోడ్డు క్రాసింగ్ వద్ద లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Source:Eenadu
‘దసరా’ చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ దర్శక ధీరడు రాజమౌళి ట్వీట్ చేశారు. శ్రీకాంత్ ఓదెల హృదయానికి హత్తుకునే లవ్‌స్టోరీ చూపించారు. నాని కెరీర్‌లోనే అత్యుత్తమ నటనను కనబరిచారు. వెన్నెల పాత్రలో కీర్తి సురేశ్ ఒదిగిపోయింది.’ అంటూ రాసుకొచ్చారు.
Source:Eenadu
నటి నభా నటేశ్ తన తాజా ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్నారు. అందమైన లుక్‌తో కనిపిస్తున్న ఈ ఫొటోకు ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు.
Source:Eenadu