చిత్రం చెప్పే విశేషాలు

(05-04-2023/1)

సిక్కింలోని నాధూలా ప్రాంతంలో మంగళవారం ఘోర దుర్ఘటన సంభవించింది. పర్యాటకులపైకి హిమపాతం దూసుకొచ్చింది. వాహనాలు పూర్తిగా మంచుకింద చిక్కుకు పోయాయి. ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. సైనికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

Source:Eenadu

రాజస్థాన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య హక్కు బిల్లుకు వ్యతిరేకంగా జైపుర్‌లో మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న వైద్యులు.

Source:Eenadu

భాగ్యనగరంలో రోజురోజుకూ ఎండలు పెరిగిపోవడంతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రత సుమారు 40 డిగ్రీలకు చేరింది. ఈ నేపథ్యంలో చిన్నాపెద్దా గొడుగుల నీడలో ప్రయాణం కొనసాగిస్తున్నారు. నగరంలో కనిపించిన చిత్రమిది.

Source:Eenadu

రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు రక్షణ వలలు ఏర్పాటు చేశారు. పంటకాలం పూర్తయినా వాటిని తొలగించలేదు. గింజల కోసం వచ్చిన చిలుకలు వలలో చిక్కుకుని మృతి చెందాయి. ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని చెమ్మన్‌గూడ వెళ్లే మార్గంలో కనిపించిన దృశ్యమిది.

Source:Eenadu

సాగు భూమి నుంచి సాంకేతిక ధామం వరకూ ఎదగగలరన్నట్టుగా ప్రతిబింబించే ఈ దృశ్యం సంగారెడ్డి జిల్లా ముంబయి జాతీయ రహదారి పక్కన కందిలోనిది. ఐఐటీ భవన సముదాయాల పక్కన పచ్చని వరి చేను, కొబ్బరి, ఇతర చెట్లు రహదారి పైనుంచి చూస్తే ఆకట్టుకుంటున్నాయి.

Source:Eenadu

పసుపు రంగులో కనిపిస్తూ.. పందిరిలా అల్లుకొని పెద్ద చెట్లను సైతం కప్పేసిన పొదలను డాడర్‌ అని పిలుస్తారు. శాస్త్రీయనామం కస్కుటా అనే పరాన్నజీవి కలుపు మొక్క. ఇవి చెట్లపై విస్తరించి వాటిని నాశనం చేస్తున్నాయని జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

Source:Eenadu

రాయపట్నం సమీపంలోని భూములు ఎల్లంపల్లి జలాలతో పచ్చని శోభను సంతరించుకున్నాయి. మోటార్లు, పంపుసెట్లతో నిల్వ నీటిని వాడుకుంటూ నదీ తీరంలో సుమారు రెండువేల ఎకరాల్లో అన్నదాతలు పంటలను సాగుచేస్తున్నారు.

Source:Eenadu

నెక్లెస్‌రోడ్‌లో ఎన్టీఆర్‌ గార్డెన్‌ పక్కన నిర్మిస్తున్న బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏప్రిల్‌ 14 ఆయన జయంతి సందర్భంగా ప్రారంభిస్తున్న నేపథ్యంలో వచ్చే రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారుల వాహనాల పార్కింగ్‌ కోసం పొక్లెయిన్లుతో జరుగుతున్న పనులివి.

Source:Eenadu

అమరావతి ఎన్టీఆర్‌ జిల్లా ఘంటసాల మండలం కొత్తపల్లిలోని ఓ ఇంటి వద్ద మామిడి కాయలకు సంచులు కట్టిన దృశ్యమిది. మామిడి చెట్టు కాపునకు రావడంతో మంచి రంగు, సైజు రావాలని ఇలా వాటిని కట్టారు. దారిలో వెళ్లే వారంతా ఈ కవర్లను ఆసక్తిగా చూస్తున్నారు.

Source:Eenadu

తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం రాత్రి శ్రీరామచంద్ర పుష్కరిణిలో స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. భక్తులు కనుటపండువగా తిలకించారు.

Source:Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(27-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(24-07-2025)

Eenadu.net Home