చిత్రం చెప్పే విశేషాలు..!

(23-05-2023/1)

నటుడు శరత్‌బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని ఫిల్మ్‌ ఛాంబర్‌కు తీసుకురాగా.. అక్కడ పలువురు సినీ ప్రముఖులు నివాళి అర్పించారు.

ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో నూతనంగా నిర్మించిన ఆ రాష్ట్ర హైకోర్టు భవనమిది. ఈ భవన సముదాయాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం ప్రారంభించనున్నారు.

ప్రకృతి అందాలకు నెలవైన కశ్మీర్‌లో జీ-20 సదస్సు జరగడం సంతోషకరమని రామ్‌చరణ్‌ చెప్పారు. విదేశీ ప్రతినిధులతో కలిసి చరణ్‌ స్టెప్పులేశారు.

జూబ్లిహిల్స్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రం ఆవరణలో పాత ఇనుప సామగ్రితో రూపొందించిన నెమలి పచ్చని చెట్ల మధ్య సందర్శకులను ఆకట్టుకుంటోంది.

ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలకు మనుషులే కాదు.. మూగజీవాలూ అల్లాడిపోతున్నాయి. బొమ్మలరామారం మండలం మైలారం గ్రామంలో ఉదయం 11 గంటలకే భానుడి తాపం తాళలేక గొర్రెలు ఇలా చెట్టు కిందికి చేరాయి.

శారీరకంగా వైకల్యం ఉంటేనేమీ.. యాదాద్రి లక్ష్మీనరసింహుడిని దర్శించుకోవాలని క్షేత్రానికి చేరుకున్నారు. కానీ, వారికి ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడంతో ఇబ్బందిపడ్డారు.

పాతపట్నంలో నీలమణిదుర్గ అమ్మవారి సంబరాల సందడి నెలకొంది. విద్యుద్దీపాలతో ఆలయం కాంతులీనుతోంది. అమ్మవారికి మంగళవారం ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.

పాతపట్నంలో నీలమణిదుర్గ అమ్మవారి సంబరాల సందడి నెలకొంది. విద్యుద్దీపాలతో ఆలయం కాంతులీనుతోంది. అమ్మవారికి మంగళవారం ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.

చిత్రం చెప్పే విశేషాలు (24-04-2024/1)

బెంగళూరులో వర్షాలు.. ప్రణీత సంబరాలు

చిత్రం చెప్పే విశేషాలు (23-04-2024/1)

Eenadu.net Home