చిత్రం చెప్పే విశేషాలు!
(17-07-2023/2)
తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా పుష్ప పల్లకీ సేవ వైభవంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకీపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు అభయమిచ్చారు.
షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జవాన్’. తాజాగా ఇందులో నటిస్తోన్న నయనతారకు సంబంధించిన ఓ ఫొటోను చిత్రబృందం ట్విటర్‌లో పంచుకుంది. ‘కొత్త జవాన్‌ను షారుక్ పరిచయం చేశారు. ఆమె ఓ తుపాను’అని ట్వీట్ చేసింది.
కేరళలోని కాసరగోడ్‌లో ‘కర్కడక వావు’ పండుగను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హిందువులు అరటి ఆకులపై అన్నంతో పూర్వీకులకు నైవేద్యం సమర్పించడం అక్కడి ఆనవాయితీ.
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ చిత్రం ‘లాల్ సలాం’. ఇందులో విష్ణు విశాల్ ‘తిరునావుకరసు’ అనే పాత్రను పోషించారు. విష్ణు పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ఓ ఫొటోను ట్విటర్‌లో పంచుకుంది.
శ్రీ కృష్ణదేవరాయల యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతిలోని ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ఆయన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సీఐ ఇటీవల జనసేన నాయకుడిపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే.
వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సైంధవ్’. ఈ సినమాలో బేబీ సార ‘గాయత్రి పాప’గా కనిపించనున్నట్లు శైలేష్ ఓ ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. వెంకటేష్‌కి ఇది 75వ చిత్రం కావడం విశేషం.
అర్జున్, శంకర్ కాంబోలో వచ్చిన హిట్ చిత్రం ‘జెంటిల్‌మేన్’. ఈ సినిమాని నిర్మించిన కె.టి. కుంజుమోన్ ‘జెంటిల్‌మేన్ 2’ నిర్మిస్తున్నారు. ఎ. గోకుల్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా మ్యూజిక్ కంపోజింగ్ ప్రారంభమైంది.