చిత్రం చెప్పే విశేషాలు!
(08-08-2023/2)
ఖైరతాబాద్ రవాణాశాఖకు కాసుల పంట పండింది. ఫ్యాన్సీ నంబర్లతో ఒక్కరోజే రూ. రూ.53,34,894ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా TS 09 GC 9999 నంబర్‌కు రూ.21,60,000ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
ఎంపీ లక్ష్మణ్ కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా రాజ్యసభలో తెలంగాణపై చర్చలు బాగున్నాయని మోదీ తెలిపారని లక్ష్మణ్ చెప్పారు. రాజ్యసభలో చర్చలు అలాగే కొనసాగించాలని మోదీ చెప్పినట్లు లక్ష్మణ్ వివరించారు.
రాజమహేంద్రవరం బీవీఆర్ ఫంక్షన్ హాల్‌లో తెదేపా నేత చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పూలమాల వేశారు. పోలవరం నిర్వాసితులను మోసం చేసిన దుర్మార్గుడు జగన్ అని విమర్శించారు.
బాపట్ల జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్ ఆదేశాల మేరకు రోడ్లపై ప్రమాదాలు నివారించాలని పోలీసులు అధికారులు కొత్త చర్యలు చేపట్టారు. ఎద్దుల బండ్లకు రేడియం ఏర్పాటు చేసినట్లు ఎస్సై సురేశ్ తెలిపారు.
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్.. హాలీవుడ్ స్టార్ గాల్ గడోట్‌కు తెలుగు నేర్పించారు. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’లో వీరిద్దరూ కలిసి నటించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ‘అందరికీ నమస్కారం.. మీకు నా ముద్దులు..’ అని ఎలా పలకాలో ఆలియా తన కో స్టార్ గాల్‌కు నేర్పించారు.
రైళ్లలో వృద్ధులు ప్రయాణించాల్సి వస్తే.. రిజర్వేషన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు లోయర్ బర్త్ ఆప్షన్ ఎంచుకున్నా.. లభించకపోవచ్చు. అదే, సీనియర్ సిటిజన్ కోటాలో బుక్ చేసుకుంటే మాత్రం తప్పకుండా లోయర్ బెర్తులు లభిస్తాయి. ఇలా ట్రై చేసి చూడండి.
ఆగస్టు 8న నటుడు ఫహాద్ ఫాజిల్ పుట్టినరోజు సందర్భంగా ‘పుష్ప2’లో ఆయన లుక్‌ను మేకర్స్ విడుదల చేసి విషెస్ చెప్పారు. ‘పుష్ప’లో ఫహాద్ ఫాజిల్.. ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్‌గా కనిపించిన సంగతి తెలిసిందే.
ప్రపంచంలోనే సంపన్న క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ ప్రభుత్వానికి ఆదాయపు పన్ను రూపంలో ఎంత చెల్లిస్తుందో తెలుసా? 2021-22 సంవత్సరంలో రూ.1159 కోట్లను ఆదాయపు పన్ను రూపంలో చెల్లించిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధురి తెలిపారు.