చిత్రం చెప్పే
విశేషాలు..!
(16-08-2023/2)
భారత క్రికెటర్ ఇషాన్ కిషన్ కొత్త లుక్‌లో కనిపించారు. ఆయనకు ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ హెయిర్ కట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ దంపతుల విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబ వారికి లాంఛనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’. సైఫ్ అలీఖాన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం ట్విటర్ వేదికగా పంచుకుంది. సినిమాలో సైఫ్.. భైర అనే పాత్ర పోషిస్తున్నట్లు తెలిపింది.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ నగల దుకాణంలో సినీనటుడు మహేశ్ బాబు సతీమణి నమ్రత సందడి చేశారు.
నాలుగేళ్లకోసారి జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ఈసారి భారత్ వేదిక. సరిగ్గా ఇంకో 50 రోజుల్లో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రపంచ కప్‌ను తాజ్‌మహల్ వద్ద ఉంచిన ఫొటోను ఐసీసీ షేర్ చేసింది.
తెజస అధ్యక్షుడు కోదండరామ్ అల్వాల్‌లోని గద్దర్ నివాసానికి వెళ్లారు. గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించి.. ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు.
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నివాళులు అర్పించారు. దిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ సమీపంలో నిర్మించిన సదైవ్ అటల్‌ను సందర్శించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మన్యం ప్రాంతం ఫొటోషూట్, వీడియో షూట్లకు నిలయంగా మారింది. కొత్తగా పెళ్లి చేసుకునే వధూవరులు రంపచోడవరం మన్యంలోని భూపతిపాలెం జలాశయం, జలపాతాలు, ఘాట్ రోడ్లలో ఫొటోలు దిగేందుకు అధిక సంఖ్యలో వస్తున్నారు.